తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. ముగింపునకు కేవలం ఒక్క వారం దూరంలో మాత్రమే ఉంది. 14 వ వారంలో ఒక్క శ్రీరామచంద్ర తప్ప మిగిలిని వారందరూ నామినేషన్లో ఉన్నారు. అయితే ఈ సారి ఎలిమినేట్ అయ్యేది మాత్రం కాజల్ అంటూ వార్తల వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. 12 వ వారంలో యాంకర్ రవి అనూహ్యంగా.. ఎవరూ ఊహించని విధంగా ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆ రోజు నుంచి కూడా అతడిది ఫేక్ ఎలిమినేషన్ అని.. నిజాయితీగా అతడు ఎలిమినేట్ కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అంతే కాదు యాంకర్ రవి హౌజ్ లో జరిగే విషయాలు అన్నీ బయటకు ప్రసారం చేయడం లేదని.. ఆడియన్స్ ను తప్పదోవ పట్టించే కంటెంట్ ను మాత్రమే ఇస్తున్నారని.. బిగ్ బాస్ నిర్వాహకులు కేవలం.. రేటింగ్ కోసం, వ్యూస్ కోసమే కంటెంట్ ను ఇస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ హౌజ్ గురించి మాత్రం బయట ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారని.. ఇది షోకు మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు.
ఇక హౌజ్ లో ఉన్నన్ని రోజులు తాను షణ్ముఖ్ తో ఎక్కువగా రిలేషన్ పెంచుకోవడానికి ప్రయత్నించానని.. ఆ క్రమంలోనే అతడికి సహాయం చేద్దామనుకున్నాను.. కానీ నేనే బయటకు వచ్చేశానని యాంకర్ రవి అన్నాడు. తను ఎన్నో పేర్లు పెట్టారని.. ఇన్‌ఫ్లుయెన్సర్ అని.. తొక్కేస్తాడని.. ఫిట్టింగ్‌లు పెడతాడని కూడా అన్నారని వాపోయాడు. సిరి, షణ్ముఖ్ తో ఫ్రెండ్లీగా అనిపించారని.. వాళ్లతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేశానని.. కానీ తననే బయటకు వెళ్లగొట్టేందుకు నామినేట్ చేశారని గుర్తు చేసుకుంటూ.. ఆవేదన వ్యక్తం చేశాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…