అక్టోబర్ 2, 2021న సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు.. తాము ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కారణం మాత్రం వాళ్లు చెప్పలేదు. దానికి ఇవే కారణాలు అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.
అయితే అందులో ఎక్కువగా ఫ్యామిలీ మెన్ సినిమాలో సమంత పాత్ర చైతూకు అస్సలు ఇష్టం లేదట. ఆ పాత్ర చేయొద్దని చెప్పినా ఆమె వినిపించుకోకుండా ఆ పాత్రలో నటించింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనేది బలంగా వినిపిస్తున్న టాక్. ఎన్నో విబేధాలకు కారణం అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించినందుకు గానూ సమంతాకు ఉత్తమ నటి అవార్డు వరించింది.
దీంతో సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమాలో ఆమె రాజీ అనే పాత్రలో జీవించేసింది. యాక్షన్ సన్నివేశాల్లో సమంత నటన అద్భుతమనే చెప్పాలి. సమంత అభిమానులు అంతక ముందు ఎప్పుడూ చూడని విధంగా అందులో నటించింది. దీంతో ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డు దక్కింది. ఈ అవార్డును సమంత వేడుకలో పాల్గొని అందుకున్నారు.
అంతే కాదు ఆమెకు.. తెలుగుతో పాటు.. హాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్, యశోద అనే రెండు పానిండియా సినిమాల్లో నటిస్తుంది. దీంతో సమంత వ్యక్తిగత జీవితానికి దూరంగా ఉన్నా.. వృత్తి పరంగా మాత్రం దూసుకెళ్తున్నారు. ఆ విడాకుల బాధ నుంచి తట్టుకోవడానికి ఆమె ఎక్కువగా సినిమాలను ఒప్పుకున్నట్లు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…