కరోనా మహమ్మారి కారణంగా 2020 లో ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ 2021లో మాత్రం ఎంత కష్టమైనా పెళ్లిళ్లు మాత్రం బాగానే జరిగాయి. అయితే ఈ సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు ఎవరో ఓ సారి లుక్కేద్దాం. అందులో మొదటగా చెప్పుకునే పేరు సింగర్ సునీత. ఆమెకు ఇది రెండో వివాహం. మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనినితో 2021 జనవరి 9న వివాహం జరిగింది.
ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. అయితే కొన్ని కారణాల వల్ల 2020లో ఆమె అతడితో విడాకులు తీసుకుంది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ వివాహం కూడా ఈ ఏడాది తన స్నేహితురాలు లోహితరెడ్డితో జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
2007 సంవత్సరంలో గోదావ చిత్రంలో నటించిన నటి శ్రద్ధా ఆర్య. దీంతో తెలుగులో పరిచయం అయింది. ఇదే సంవత్సరంలో ఆమె తమిళంలో కూడా కాల్వనిన్ కాదల్ ద్వారా పరిచయం అయ్యారు. నవంబర్ 16, 2021న, ఆర్య తన స్వస్థలమైన న్యూఢిల్లీలో భారతీయ నావికాదళ అధికారి రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు . బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. యూరీ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను వివాహం చేసుకుంది.
బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రణీత వివాహమాడింది. బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను హీరో విష్ణు విశాల్ వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మీర్జా, వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుంది. విక్కీ కౌషల్ ను కత్రినా కైఫ్ వివాహమాడింది. ఇలా ఎంతో కాలంగా కోవిడ్ కారణంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న పెళ్లిళ్లు ఈ ఏడాది పూర్తయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…