Political News

Rayapati Shailaja : మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకునేది లేదు! మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక

Rayapati Shailaja : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కొన్ని మీడియా సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ నాయకుల అండతో నడిచే ఇలాంటి సంస్థలు సమాజానికి చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్య పదజాలం వాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Women’s Commission Chairperson Rayapati Sailaja warns that there will be no peace if women’s self-respect is damaged

“జర్నలిస్టులు బాధ్యత లేకుండా అసత్య కథనాలు ఎలా ప్రసారం చేస్తారు?” అని ఆమె ప్రశ్నించారు. గుంటూరులో 150 ఇన్‌స్టిట్యూట్‌లు ఫీమేల్ సెక్స్ వర్కర్స్‌తో రిజిస్టర్ అయ్యాయని ఒక జర్నలిస్ట్ చెప్పడం అవాస్తవం అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డేటా ప్రకారం, ప్రతి జిల్లాలో ఎంతమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, వారితో పనిచేసే ఎన్జీఓలు ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని ఆమె వివరించారు.

“టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చిందని చెబుతున్నారు. అందులో కూడా ఒక ప్రాంతం పేరు చెప్పకుండా రాష్ట్రం గురించి మాత్రమే రాశారు. కానీ వీళ్ళు రాజకీయ కారణాల కోసం ఒక ప్రాంత మహిళలను అవమానించడం చాలా తప్పు” అని శైలజ అన్నారు. అమరావతి ప్రాంత మహిళలు రాజధాని కోసం భూములిచ్చి త్యాగం చేశారని, అలాంటి వారిని కించపరచడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. మీడియా ప్రజల పక్షాన నిలబడాలని, ప్రభుత్వంలోని మంచి చెడులను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రాజకీయ నాయకుల నీడలో నడిచే ఛానళ్లు సమాజానికి ప్రమాదకరమని ఆమె పునరుద్ఘాటించారు. గతంలో రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అన్నందుకు ఒక జర్నలిస్ట్ రైతులపై కేసు పెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశామని, డీజీపీకి లేఖ రాశామని శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా లేఖ రాసి, ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరామని చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా రాసి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామని ఆమె అన్నారు. అవసరమైతే అలాంటి ఛానళ్లను మూసివేసే అధికారం కూడా ప్రెస్ కౌన్సిల్‌కు ఉందని ఆమె గుర్తు చేశారు.

మహిళా కమిషన్‌కు నేరుగా అరెస్ట్ చేసే అధికారం లేదని, కానీ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ లేదా డీజీపీకి చెప్పగలమని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో రెండో వ్యక్తికి, సాక్షి మీడియా యాజమాన్యానికి, చీఫ్ ఎడిటర్‌కు సమన్లు జారీ చేస్తున్నామని ఆమె తెలిపారు.

“తప్పు చేస్తే క్షమాపణ కోరవచ్చు కదా? అలా చేయకుండా దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago