రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50 వేలకు మించి లావాదేవీలకు సంబంధించిన చెక్కుల విషయంలో కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. నూతన విధానం ద్వారా వినియోగదారులకు భారీగా ప్రయోజనం కలగనుంది. చెక్ బ్యాంకింగ్ ఫ్రాడ్ ను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో చెక్కుల ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు తేలడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
నూతన విధానం ప్రకారం 50,000 రూపాయలకు పైగా చెక్కులు జారీ అయితే మొదట అకౌంట్ హోల్డర్ నుంచి చెక్కుకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు. అకౌంట్ హోల్డర్ చెప్పిన సమాచారాన్ని ధృవీకరించుకుని ఆ తర్వాత చెక్ పాస్ చేస్తారు. అకౌంట్ హోల్డర్ చెక్కు ఇవ్వలేదని చెబితే ఆ చెక్ పాస్ కాదు. ఎవరైతే 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా లావాదేవీలు జరుపుతారో వాళ్లు చెక్కుల ద్వారా లావాదేవీలు చేయాల్సి ఉంటుంది.
ఎవరైతే చెక్ ను జారీ చేస్తారో వాళ్లు చెక్కులో పొందుపరిచిన వివరాలను ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మెసేజ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ వివరాలను చెప్పాల్సి ఉంటుంది. బ్యాంక్ అధికారులు పేమెంట్ ప్రాసెస్ చేసే ముందు మరోమారు పూర్తిస్థాయిలో క్రాస్ చెక్ చేస్తారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొన్ని బ్యాంకులలో పాజిటివ్ పే సిస్టమ్ ను అమలు చేయనుంది. ఏ చెక్కులు అయితే పాజిటివ్ పే సిస్టమ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయో ఆ చెక్కులు మాత్రమే క్లియర్ అవుతాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…