ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికంగా ఉండడంతో కొత్త టెక్నాలజీతో ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటి ధరలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ రియల్ మీ నార్జో 30 ప్రో 5 జీ ఫోన్లను కంపెనీ అత్యంత చౌకైన ధరలకు అందించనుంది.ఫ్లిప్ కార్ట్ కార్నివాల్ సేల్‌లో ఈ ఫోన్ల ధరలను తగ్గించారు. మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. అయితే ప్రస్తుతం ఈ ఫోన్లో పై మరింత తగ్గింపు లభిస్తుంది. మరింత ధరలు తగ్గించడంతో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.15,999కే అందుబాటులో ఉండనుంది.
ఈ ఫోన్లో రెండు వేరియంట్ లు ఉన్నాయి.6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా ప్రస్తుతం ఈ సేల్స్ లో ఈ ఫోన్ ధర రూ.15,999లకే అందిస్తోంది. అదేవిధంగా మరొక వేరియంట్8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సేల్స్ లో 18,999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లలో
స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్ కలర్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది.ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. ఇక కెమెరాల విషయానికొస్తే మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 48 మెగా పిక్సెల్ కాగా,8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఫ్రెండ్ కెమెరా కూడా 16 మెగా పిక్సల్ లో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మందం 0. 91 సెం.మీ, బరువు 194 రాములు గా ఉంటుంది
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…