వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన లడ్డూ వేలంపాట మరోసారి రికార్డు సృష్టించింది. రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన లడ్డూ వేలంలో గత రికార్డులు బద్దలయ్యాయి.
గత ఏడాది ఈ కమ్యూనిటీలో గణేశ్ లడ్డూ రూ. 1.87 కోట్లు పలికింది. అయితే ఈసారి ఆ ధరను మించి ఏకంగా రూ. 2 కోట్లు 31 లక్షల 74 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ రికార్డు ధర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లడ్డూను సొంతం చేసుకుంటే ఐష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే వేలంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, లడ్డూ కోసం తీవ్రంగా పోటీపడ్డారు.
వినాయక లడ్డూ వేలంపాటలు సాధారణంగా ప్రతి ఏటా రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే, కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నమోదైన ఈ ధర దేశవ్యాప్తంగా ఉన్న వేలంపాటల్లో అత్యధికమైన వాటిలో ఒకటిగా నిలిచింది. డప్పుల మోతలు, భజనలు, నృత్యాల మధ్య జరిగిన ఈ వేలంపాట, ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిసింది.
ఈ లడ్డూను దక్కించుకున్న భక్తులు తాము అదృష్టవంతులమని భావిస్తున్నారు. ఈ ఏడాది ఈ రికార్డును మించిన వేలం మరెక్కడైనా జరుగుతుందేమో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…