Renudesai: పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అకిరా నందన్ సినిమాలలోకి వస్తే చూడాలని ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరాటపడుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరాతో కలిసి రాఘవేంద్రరావు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
రాఘవేంద్రరావు అకిరాతోపాటు తన మనవడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వీరిద్దరూ యూఎస్ఏ లో ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త సమయానికే రాఘవేంద్రరావు డిలీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు…
ఈ ఫోటోలపై రేణు దేశాయ్ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన కుమారుడు అఖీరా నందన్ కు ప్రస్తుతం సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదని తెలిపారు. భవిష్యత్తులో తన నిర్ణయాలు ఎలా మారుతాయో తనకు తెలియదని ఈమె తెలిపారు. అయితే ఇలా ఫోటోలపై ఊహగానాలు మాత్రం ఆపేయాలని ఈమె కోరారు.
ఒకవేళ ఆకిర సినిమాలలోకి కనుక రావాలి అనుకుంటే తానే ఈ విషయాన్ని స్వయంగా తెలియజేస్తానని ఈమె వెల్లడించారు. ఇలా అకిరా నందన్ సినిమాలలోకి రాబోతున్నారని అభిమానులు సంతోషపడేలోపు రేణు దేశాయ్ అకిరాకు నటన అంటే ఆసక్తి లేదంటే కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అభిమాన హీరో వారసుడు ఇండస్ట్రీలోకి వస్తే చూడాలని ఆత్రుతతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి.
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్‌ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…