Revanth Reddy: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో ఎంతో ఫేమస్ అయ్యారు ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ జీవనోపాధి కోసం కష్టాలు పడుతున్నటువంటి ఈమె యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అత్యంత తక్కువ ధరలకు ఎన్నో రకాల వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఈమె అందరికీ అందించడంతో ఈమె వద్దకు ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తులు కూడా వచ్చి భోజనం చేసేవారు.
అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్స్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది దీంతో కొందరు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసేసారు. దీంతో ఈమె బిజినెస్ పూర్తిగా క్లోజ్ అయిందని అందరూ భావించారు అంతేకాకుండా ఈమెకు మద్దతుగా కొందరు నిలిచారు.
తాజాగా ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి తిరిగి ఈమె ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవచ్చు అంటూ ఆదేశాలను జారీ చేశారు ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేసుకునే వారి పట్ల చూసి చూడకుండా వెళ్లాలి అంటూ ఈయన ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారి ఆంటీ కష్టాలు మొత్తం తీరిపోయాయని తెలుస్తుంది.
కుమారి ఆంటీకి అండగా సీఎం రేవంత్…
ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈమె తిరిగి తన ఫుడ్ బిజినెస్ ప్రారంభం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అండగా నిలవడంతో కుమారి ఆంటీ పాపులారిటీ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. కుమారి ఆంటీ మాటతీరుతో ఎంతోమంది రీల్స్ కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ఈమెకు చివరికి ఆ పాపులారిటీ ద్వారానే తన బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితికి వెళ్లారు కానీ సీఎం చొరవతో ఏదావిధిగా తన బిజినెస్ ప్రారంభించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…