Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ దివంగత సీనియర్ నటి సౌందర్య బయోపిక్ చిత్రం గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఇప్పటికే సౌందర్య బయోపిక్ చిత్రం గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సౌందర్య బయోపిక్ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ అలాంటి ఒక గొప్ప నటి బయోపిక్ సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.
చిన్నప్పుడు నన్ను చూసి మా డాడీ అచ్చం సౌందర్య లాగే ఉన్నావు అంటూ చెప్పేవారు అలాంటి ఒక గొప్ప నటితో పోల్చడం నిజంగా చాలా గౌరవంగా అనిపించింది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక సౌందర్య కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
గౌరవంగా భావించాను..
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె రాజకీయాలలోకి వెళ్లారు 2004 బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…