Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆరు గ్యారెంటీ హామీల ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ఇక రెండవ సంతకం దివ్యాంగ మహిళ అయినటువంటి రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ రేవంత్ రెడ్డి రెండవ సంతకం చేశారు.
ఇక ఈయన ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే రజిని ఆహ్వానించి ఆమెకు ప్రభుత్వ కొలువులో నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 17వ తేదీ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రజిని హైదరాబాద్ నగరం నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందినది. ఈమె లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదివారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఈమె తనకు ఉద్యోగం లేదు అంటూ తన బాధను మొత్తం చెప్పకున్నారు అయితే తన పరిస్థితి విన్నటువంటి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తన ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేస్తానని తెలియజేశారు.
టీఎస్‌ఎస్ఓసీఏ మేనేజర్ గా రజిని..
ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ మొదటి ఉద్యోగ నియామక పత్రకం పై సంతకం చేశారు.ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం కల్పించారు ఇక ఈమెకు నెలకు 50 వేల వరకు వేతనం రాబోతుందని నియామక పత్రాలలో పేర్కొన్నారు.
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…