Revanth Reddy's sensational comments! Strong response on phone tapping and BC reservations!
న్యూ ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫోన్ ట్యాపింగ్, బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన మీడియా చిట్ చాట్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఇప్పటివరకు నోటీసులు అందలేదని, వచ్చిన తర్వాత తప్పకుండా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం ఎలాంటి కేసు నమోదు చేయలేదని, కేవలం హార్డ్ డిస్క్‌లు మాయమైన ఘటనపై మాత్రమే దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. దాన్ని లోతుగా పరిశీలించితే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. “అన్ని ప్రభుత్వాలూ ఒకేలా వ్యవహరించాయంటే, కేటీఆర్ వంటి నేతలు విచారణ కమిషన్ ఎదుటనే ఆ విషయాలు చెప్పాలి” అని హితవు పలికారు. కేటీఆర్‌కు తన వాక్ స్వేచ్ఛను లాగేయాలనే ఉద్దేశం లేదని, కానీ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో మాత్రం ఆయననే చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కన్నా, ఆత్మహత్య చేసుకుంటే మెరుగై ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.
ఇక బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఆయన తన ప్రభుత్వ బద్ధతను ప్రదర్శించారు. “కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లతో బీసీల కోసం ప్రత్యేక బిల్లును రూపొందించాం. ఇది దేశానికే రోల్ మోడల్” అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం వెంటనే ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో మద్దతు తెలిపిన ఆ పార్టీ నాయకుడు రామచందర్ రావు బహిరంగంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. తమ లక్ష్యం రాజ్యాంగం మేరకు సరైన రిజర్వేషన్లను కల్పించడమేనని తెలిపారు.
ఈ అంశంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో రేపు సమావేశం కానున్నట్టు తెలిపారు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై వారితో చర్చించి, కేంద్రంపై ఒత్తిడి పెంచేలా విపక్ష కూటమిని సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. “బీసీ హక్కుల కోసం కేంద్రం మెడలు వంచి గెలిచే వరకు పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…