తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ‌ నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ కు చెందిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి 31 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ఎఫ్‌సీఎల్‌ ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండెంట్ గ్రేడ్‌-1 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

ఐటీఐ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐలో ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. https://www.nationalfertilizers.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 31 ఖాళీలలో మెకానికల్ అభ్యర్థులకు 11, ఎలక్ట్రికల్ అభ్యర్థులకు 12, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అభ్యర్థులకు 8 ఖాళీలు ఉన్నాయి.

30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం వయో సడలింపులు ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్షలో సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలతో పాటు ఆప్టిట్యూడ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆన్ లైన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.