గత కొద్ది రోజులుగా ఇంటి ప్రాంగణానికే పరిమితం అయి షూటింగ్ లకు దూరంగా ఉంటూ, ఫిట్ నెస్ పై పూర్తి దృష్టిసారించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కుదుటపడింది. ఆయన ఆస్పత్రి నుంచి ఎప్పుడో డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంకా కొంత కాలం షూటింగ్ లకు దూరంగా ఉండడమే మేలు అని వైద్యులు చెప్పిన సలహా మేరకు ఆయన ఇంటికే పరిమితం అయి ఉన్నారు.
ఇప్పుడు తన గాయాలన్నింటి నుంచి పూర్తి స్థాయిలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు. ఇక అతడు హైద్రాబాద్ లో రోప్ వే బ్రిడ్జీ సమీపాన ప్రమాద వశాత్తూ బైక్ స్కిడ్ అయి గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయనను సమీప ఆస్పత్రికి 108 లో తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అపోలోకు చేర్చి, వైద్యం అందించారు. తరువాత ఆయన క్రమంగా కోలుకున్నాడు. ఆసుపత్రిని డిశ్చార్జి అయిన తర్వాత అతడు ప్రేక్షకులకు ఒక్కసారి మాత్రమే కనిపించాడు.
అది కూడా దీపావళి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులోనే అతడు కనిపించాడు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతడు కోమాలోనే ఉన్నాడు. సినిమా విడుదల సందర్భంలో కూడా అతడు కోలుకోలేదు. అయితో రిపబ్లిక్ సినిమా ఓటీటీలో విడుదలకు ముందు మాత్రం అతడు అభిమానులతో ముచ్చటించాడు. ప్రమోషన్లలో పాల్గొన్నాడు. ఇక ప్రస్తుతం అతడు బాగా సన్నపడ్డాడని సమాచారం.
దాని కోసం ఫిట్ నెస్ ను పెంచుకునే పనిలో పడ్డాడు సాయిధరమ్ తేజ్. ఇక అతడి తదుపరి చిత్రాలపై ఎక్కువగా శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. అతడికి యాక్సిడెంట్ కాకముందు చేతిలో సినిమాలు ఉండేవి… తర్వాత అవి అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. తాజాగా అతడికి కార్తిక్ అనే వ్యక్తి కథను వినిపించాడని.. అది ఓకె అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. దాంతో పాటు.. తన బావ వరుణ్ తేజ్ తో కలిసి సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ రెండు సినిమాలతోనే సాయి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ మళ్లీ మునిపటిలా మారడానికి మాత్రం 2022 ఫిబ్రవరి వరకు పట్టే అవకాశం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…