సినిమాల్లో కాస్త డిఫరెంట్ గా హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించడం ఈ మధ్య చాలనే చూస్తున్నాం… గతంలో ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రమే పాటలు పాడాలన్నా సంప్రదాయం నుంచి ప్రస్తుతం కాస్త వెరైటీగా హీరోలు, హీరోయిన్లు తమ గొంతును సవరించుకుంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో వెంకీ, చిరంజీవి, పవన్ కళ్యాన్, రవితేజ, ఎన్టీఆర్ వంటి వారు తమ సినిమాల్లో పాటలు కూడా పాడారు. మరో వైపు రాశీ ఖన్నా, శృతి హాసన్ వంటివారు కూడా పాటలు పాడారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ పాట పాడారు.
కరీంనగర్ లో జరిగిన ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం. ఆయన నిర్ణయం సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే పాటను పాడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనలోని సింగింగ్ టాలెంట్ను బయటకి తీశారు. మొదట మొహమాటంగా పాడినట్లు కనిపించినా.. తరువాత పాటలో లీనమై పాటను పాడారు.
గతంలో కూడా దిల్ రాజు సినిమాలో పాటపాడారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ ను దిల్ రాజు నిర్మించారు. ఆ సినిమాలో ‘అన్నయ్యెచ్చినాడు’ అంటూ మొదటి సారిగా పాటను పాడారు. ఆస్పూర్తితోనే మళ్లీ తనలోని గాయకుడిని బయకు తీశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు పాడిన పాట వీడియో వైరల్ అయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…