ఐకాన్ స్టార్ నటిస్తున్న పుష్ప మూవీపై అంచానాలు పీక్స్ లో ఉన్నాయి. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ బాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సుకుమార్, బన్నీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ కాంబినేషన్ మూవీని డిసెంబర్ 17న విడుదల కానుంది.
ఇప్పటికే మూవీలోని అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సమంత ఐటెం సాంగ్ కూడా ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చింది. ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు జనాలను అలరిస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది. ఈ ఐటెం సాంగ్ ను తొలగించాని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సంస్థ కేసు వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఐటెం సాంగ్ చిత్రీకరించిన మూవీ టీమ్ తో పాటు నటించినందుకు సమంతపై కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది.
ఈ పాట లిరిక్స్ లో పురుష సమాజాన్ని కించపరిచేలా ఉందని సదురు సంస్థ కేసు వేసింది. మీ మగజాతి అంతా ఇంతే అన్నట్లు ఉండే ఈ లిరిక్స్ పై వివాదం చెలరేగింది. దీనిపై చిత్ర యూనిట్ క్షమాపణ చెప్పాలని సదరు సంస్థ డిమాండ్ చేస్తోంది. అయితే కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే కనుక తీవ్ర వివాదానికి దారి తీస్తే పాట లిరిక్స్ మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…