Sai pallavi: నాగచైతన్యతో సాయి పల్లవి లిప్ కిస్.. రూల్స్ బ్రేక్ చేసిందా.. క్లారిటీ ఇచ్చిన నటి?

Sai pallavi: సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు ఈమె ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చారు. అనంతరం తెలుగులో ఫిదా సినిమాలో నటించి ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైనటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఎన్నో రూల్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో కొనసాగుతుందనే విషయం మనకు తెలిసిందే.

ఈమె సినిమాకు ఒప్పుకోవాలి అంటే ఆ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. అంతేకాకుండా ఎలాంటి గ్లామర్ షోకి తావు ఉండకూడదు లిప్ కిస్ వంటి సన్నివేశాలలో తాను నటించను అంటూ ఖరాకండిగా చెప్పేస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని రూల్స్ పెట్టుకున్నటువంటి సాయి పల్లవి ఓ సినిమా విషయంలో తన రూల్స్ బ్రేక్ చేసింది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నాగ చైతన్య సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో వీరిద్దరూ కూడా ఒక సన్నివేశంలో లిప్ కిస్ పెట్టుకుంటారు. ఈ సినిమాలో నిజంగానే సాయి పల్లవి నాగచైతన్యకు లిప్ కిస్ ఇచ్చారా ఈ సినిమా విషయంలో ఈమె తన రూల్స్ బ్రేక్ చేశారా అన్న సందేహం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయం గురించి స్వయంగా సాయిపల్లవి క్లారిటీ ఇచ్చారు.

నో కిస్ పాలసీ..
ఆ సన్నివేశంలో సరైన ఎక్స్ ప్రెషన్స్ పలికించేందుకు తనే ఎక్కువ సమయం తీసుకుందని చెప్పింది. అది ఫేక్ కిస్ అని.. కెమెరా హ్యాండిల్ చేసే విధానంలో రియల్ కిస్ లా కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక నో కిస్ పాలసీకి సాయి పల్లవి కట్టుబడే ఉన్నానని తెలిపారు. ఇక తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో తండేల్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.