దేశ వ్యాప్తంగా కోవిడ్19 విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే.. ప్రతీ రోజు కొన్ని లక్షల కేసులు నమోదవుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా ‘రాధే’ ను గురువారం రంజాన్ పండుగ సందర్భంగా జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే దేశంలో లాక్ డౌన్ షరతుల్లేని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ‘రాధె’ను థియేటర్లలో రిలీజ్ చేశారు.
వాటి ద్వారా వచ్చిన వసూళ్లు నామమాత్రం. ఇక విదేశీ మార్కెట్లలో అవకాశం ఉన్న చోట భారీగానే సినిమాను రిలీజ్ చేశారు.ఐతే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం ప్రతికూలం అయింది. తొలి రోజు ‘రాధె’ విదేశీ మార్కెట్ల నుంచి రూ.5 కోట్ల మేర మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు అంచనా. విదేశాల్లోనూ కొవిడ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ వసూళ్లు మరీ తక్కువ కాదని..పర్వాలేదని అంటున్నారు.
ఇక ఇండియాలో ఈ సినిమా తొలి రోజు ఏ మేర కలెక్షన్లు రాబట్టిందన్నది ఆసక్తికరం.జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది చూసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. ఈ మార్గంలో సినిమా తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయినట్లే. ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249..ఈ లెక్క ప్రకారం42 లక్షల మంది తలో 249 రూపాయలు వెచ్చించారంటే వసూళ్లు 104 కోట్లకు పైగానే ఉండాలి.
ఐతే తొలి రోజు ఉన్న ఊపు రెండో రోజుకు కచ్చితంగా ఉండదు. పైగా సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. మరి రెండో రోజు వసూళ్ల సంగతేంటో చూడాలి. ఐతే రాధె టికెట్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయానికి తోడు జీ వాళ్లకు పెద్ద ప్రయోజనమే కలిగింది ‘రాధె’ ద్వారా. ఆల్రెడీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు తోడు కొత్తవాళ్లు ‘రాధె’ కోసం ‘జీ’ ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. రాధెతో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్ 499కి అందించింది జీ. ఈ ఆఫర్ వాడుకున్న వాళ్లు లక్షల్లోనే ఉంటారు..అలా ఎటు చూసినా ఓటీటీ వారికి ఈ సినిమా ద్వారా మంచి లాభమే చేకూరిందని చెప్పాలి…!!
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…
పూర్తి వార్తా కథనం సినీ రంగంలో వెలుగొందుతున్న ప్రతి నటుడి వెనుక ఒక కథ ఉంటుంది. బయటికి కనిపించే గ్లామర్…
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…