వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇదే విధంగా నిన్న అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరెస్ట్ కు ఇది సమయం కాదని.. ముందు కోవిడ్ రోగులను కాపాడడంపై దృష్టి సారించాలని పవన్ వ్యాఖ్యానించారు.ఓవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోందని.. ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమర్థనీయం అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న కారణంతో ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమర్థింపు చర్య కాదని జనసేనాని తెలిపారు.ఏపీలో ఓ పక్క ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లుకు తరలిస్తుండగా.. అవసరమైన మందు కోసం ఏపీలో పది షాపులు తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల బాధలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. ఈ సమయంలో అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని పవన్ అన్నారు.
ఏపీలో వైద్య సేవలు అందక తెలంగాణ, పక్క రాష్ట్రాలకు వెళుతూ సరిహద్దుల్లో ఏపీ వాసులు చస్తుంటే జగన్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని పవన్ విమర్శించారు. వారిపై కంటే రఘురామ అరెస్ట్ నే ఇప్పుడు ముఖ్యమా? అని పవన్ నిలదీశారు. సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేయడంపై చూపించిన శ్రద్ధ.. కోవిడ్ రోగులపై చూపించరా? అని పవన్ ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ అన్నయ్య, జనసేన నేత నాగబాబును ఇదే రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో ఓడించాడు. అయితే పవన్ మాత్రం తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్ట్ పై స్పందిచడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..!!
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…