Samyuktha Menon: సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడం అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే ధనుష్ సార్, సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమాతో వరుస హిట్ సినిమాలను అందుకున్నటువంటి ఈమెను గోల్డెన్ లెగ్ అంటూ పొగిడారు. ఇలా సూపర్ హిట్ సినిమాలను అందుకొని ఎంతో టాలెంట్ కలిగి ఉన్నటువంటి సంయుక్త తర్వాత సినిమాలను మాత్రం ప్రకటించలేదు.
ప్రస్తుతం ఈమెకు కళ్యాణ్ రామ్ సరసన నటించిన డెవిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా తర్వాత సంయుక్త ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంయుక్త మీనన్ కు అవకాశాలు ఏమాత్రం తగ్గిపోలేదని తెలుస్తుంది.
ఈమెకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి అయితే వచ్చిన అవకాశాలు అన్నింటినీ సద్వినియోగం చేసుకోకుండా కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. అందుకే ఈ సినిమాల ఎంపిక విషయంలో ఈమె జాగ్రత్తలు వ్యవహరించడంతో మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…