Vijay Varma: విజయ్ వర్మ ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈయన ఎప్పుడైతే తమన్న ప్రేమలో ఉన్నానని తెలియజేశారో అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమయ్యారు. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈయన బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
తమన్నాతో కలిసి విజయ్ వర్మ నటించిన లస్ట్ స్టోరీస్ 2ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ షూటింగ్ సమయంలోనే తమన్నతో ఈయన ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని వీరిద్దరూ బహిర్గతంగా ప్రకటించారు. ఈ సిరీస్ ప్రమోషన్ల కోసమే ప్రేమలో ఉన్నామని చెప్పారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తాను నిజంగానే తమన్నా ప్రేమలో ఉన్నానని తెలిపారు.
ఇకపోతే పెళ్లి చేసుకోవాలని విజయ్ వర్మ ఇంట్లో ఒత్తిడి అధికమవుతుందంటూ కూడా వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై స్పందించినటువంటి విజయ్ వర్మ మాట్లాడుతూ తాను మార్వాడి కమ్యూనిటీకి చెందిన వాడిని మా కమ్యూనిటీలో 16 సంవత్సరాలు వస్తే పెళ్లి వయస్సు వచ్చినట్లేనని భావిస్తారు. అందుకే నాకు మా ఇంట్లో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఎప్పటినుంచో ఉందని తెలిపారు.
ఇక ఈ మధ్యకాలంలో ఆ పెళ్లి ఒత్తిడి కాస్త తగ్గిందని తెలిపారు. ఎందుకంటే నేను ఆ పెళ్లి వయసు ఎప్పుడు దాటిపోయాను అంతే కాకుండా నేను సినిమాలలో ఉండటం వల్ల పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి కాస్త తగ్గింది అంటూ ఈ సందర్భంగా విజయ్ వర్మ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే త్వరలోనే తమన్నా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అర్థమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…