Featured

Sandhya Janak : అల్లరి నరేష్ సినిమాకు నాకు సగం డబ్బులే ఇచ్చారు… వెన్నెల కిషోర్ పక్కన సెక్సీగా : సంధ్య జనక్

Sandhya Janak : తల్లి పాత్రలతో మెప్పిస్తున్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో ఒకరు సంధ్య జనక్ ఒకరు. తెలుగు ప్రాంతానికి చెందిన వారే అయినా తండ్రి ఉద్యోగ రీత్యా నార్త్ లో ఉండటం వల్ల అక్కడే చదువుకున్నారు. ఇక సినిమాల్లోకి రాకమందు జర్నలిస్ట్ గా పని చేసిన సంధ్య సినిమాల్లో తమన్నా తల్లి పాత్రలో ‘హ్యాపీ డేస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడేళ్ల సినిమా ప్రస్థానంలో ఎన్నో సినిమాలను చేసిన ఆమె తన కెరీర్ గురించిన విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అల్లరి నరేష్ సినిమాకు డబ్బు ఇవ్వలేదు… ఇంకా నయం మార్ఫింగ్ చేయలేదు…

యముడికి మొగుడు సినిమాలో సంధ్య జనక్ గారు నటించారు. అయితే ఆ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసినా పేమెంట్ సరిగా ఇవ్వకపోవడం వల్ల కంప్లెయింట్ చేసి పోరాడితే చెప్పిన దాంట్లో సగం పేమెంట్ ఇచ్చారు. బళ్లకు నష్టాలు వచ్చాయి అది అంటూ కారణాలు చెప్పడం తో వదిలేసాను. అలా పేమెంట్ సరిగా ఇవ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పారు. ఇక వెన్నెల కిషోర్ నటించిన ‘అతడు ఆమె ఓ స్కూటర్’ సినిమాలో వెన్నెల కిషోర్ కి తల్లి పాత్రలో నటించాను.

అయితే సినిమా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాళ్ళు వెన్నెల కిషోర్, సంధ్య జనక్ సెక్సీ సీన్స్ అంటూ వీడియో కింద పెట్టారు ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం ఉండదు. హీరో హీరోయిన్స్ సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయి అవి కూడా అభ్యంతరకరంగా ఏం లేవు కానీ పేరు నాదెందుకు పెట్టారో తెలియదు అంటూ చెప్పారు. ఇంకా నయం నా మొహాన్ని మార్ఫింగ్ చేసి పెట్టలేదు సంతోషం. ఇలా చేసినా వీడియో ఓపెన్ చేసి చూస్తే లోపల ఏముందో తెలుసుకుంటారు కదా అక్కడ ఉన్నది నేనా వేరేవాళ్ళ అని దానివల్ల ఇబ్బంది ఉండదు అంటూ తన అనుభవాలను పంచుకున్నారు సంధ్య జనక్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago