Featured

Sanghavi : షూటింగ్ సమయంలో సంఘవిని బాగా తిట్టిన స్టార్ హీరో…!

Sanghavi : 90 దశకంలో టాప్ హీరోయిన్ గా వెలిగిన తారాల్లో సంఘవి ఒకరు. అప్పట్లో తెలుగు, తమిళం, కన్నడ అంటూ అన్ని భాషలలోనూ నటించింది. సంఘవి పుట్టింది కర్ణాటక మైసూర్ లో. సంఘవి అలనాటి తమిళ తార ఆరతి మనవరాలు, ఆవిడ వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. మొదటి సినిమా అజిత్ సరసన చేసినా, హీరో విజయ్ తో ఏకంగా నాలుగు సినిమాలు చేసి హిట్ పెయిర్ గా నిలిచారు. ఇక తెలుగులో ఒక వెలుగు వెలిగింది సంఘవి. అందరూ అగ్ర హీరోలతో నటించింది.

షూటింగ్ లో పక్కకు పిలిచి క్లాస్…

రసిగన్, కోయంబత్తూర్ మాపిలై, విష్ణు, నిలవేవా వంటి సినిమాల‌లో సంఘవి, విజయ్ కలిసి నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సంఘవి విజయ్ తో విష్ణు సినిమా చేసిన సమయంలో ఒక సాంగ్ షూటింగ్ కోసం నీళ్ళల్లో దిగి డాన్స్ చేయాలి, సంఘవి షాట్ ఒకే అని చెప్పడంతో నీళ్లలో దిగి రెడీ గా ఉంది కానీ విజయ్ మాత్రం నీళ్ళల్లో దిగే ధైర్యం చేయలేదు. ఆ సినిమాకు విజయ్ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ డైరెక్టర్. ఇక విజయ్ ఎంతకి నీళ్ళల్లో దిగకపోవడంతో విజయ్ ని తిట్టాడట. ఆడపిల్ల ధైర్యంగా నీళ్ళల్లో దిగింది నీకేంటి అని అరిచేసరికి దిగాడట.

షూటింగ్ తరువాత నీ వల్లే మా నాన్న నన్ను అరిచాడు అంటూ పక్కకు పిలిచి సంఘవికి క్లాస్ పీకాడట. ఇక సంఘవి తన 10 ఏళ్ల కెరీర్ లో చేసిన సినిమాలు 95 అయితే అందులో 45 తెలుగు సినిమాలే. మిగిలినవి తమిళం, కన్నడ సినిమాలు. ఇక తెలుగులో మొదటి సినిమా సింధూరం. ఈ సినిమాకు సంఘవికి నంది అవార్డు వచ్చింది. ఇక శివయ్య సినిమా దర్శకుడు సురేష్ వర్మ తో ప్రేమ పెళ్లి చేసుకున్న సంఘవి కొన్నాళ్లకు విడాకులు తీసుకుంది. ఇక ఆ తరువాత బెంగళూరు కి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలు చేస్తూ అలాగే బుల్లితెర మీద కనిపిస్తూ సందడి చేస్తోంది.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

9 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

9 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

10 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

10 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

10 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

10 hours ago