Yash & Mrunal Thakur : సినిమాల్లో కొంత మంది ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. ఒక్క సినిమాతో అలా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో అయినా హీరోయిన్ అయినా ఆ ఒక్క సినిమాలో నటించి స్టార్ అయిపోరు. దానికోసం ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుంది. అంతకు ముందు ఎన్నో కనీ కనిపించని పాత్రల్లో చేసుంటారు. కానీ మనం వాళ్ళు మెయిన్ లైట్ లోకి వచ్చాక మాత్రమె చూస్తాము. అలా కింద నుండి పైకి వచ్చిన వాళ్లలో ఎంతో మంది టీవీ ద్వారా మొదలు పెట్టి వెండి తెర పై సత్తా చాటుతున్న సెలబ్రిటీలు ఉన్నారు.
సీరియల్స్ తో మొదలై సినిమాల్లో సత్తా చాటుతున్న తారలు…
సినిమాల్లో చిన్న చిన్నవేషాలు వేసి ప్రస్తుతం హీరోలు హీరోయిన్లుగా ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలా రవితేజ, అడవి శేష్, త్రిష, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇక సీరియల్స్ లో మొదలు పెట్టి సినిమాల్లో కి వచ్చి సెలబ్రిటీలుగా ఉన్నవాళ్లలో మొదట బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను చెప్పాలి. బాలీవుడ్ హీరో షారుఖ్ ఇపుడు టాప్ హీరో కానీ కెరీర్ మొదట్లో సీరియల్స్ లో కూడా నటించారు. ఇక బాలీవుడ్ బోల్డ్ నటి విద్యా బాలన్ కూడా మొదట సీరియల్ ద్వారా పరిచయమైంది. ఇక యామి గౌతమ్ కూడా సీరియల్స్ లో మొదట ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు నటుడు కాకపోయినా అందరి హృదయల్లో ఉన్న సుశాంత్ రాజ్ పుత్ కూడా తన కెరీర్ ను మొదట బుల్లితెర మీద మొదలు పెట్టాడు. ఇక రాధికా మదన్ అక్షయ్ కుమార్ సరసన ఆకాశమే నీ హద్దురా సినిమా రీమేక్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఈమె కూడా సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది.
ఇక తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా మొదట సీరియల్స్ లో నటించి ఆ తరువాత హీరోయిన్ అయింది. ఇక తెలుగు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఒకప్పుడు సీరియల్స్ చేసింది. ఇక ఇటీవలే తెలుగులో సీతా రామం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మృనాల్ ఠాకూర్ కూడా హిందీ సీరియల్ ‘కుంకుమ భాగ్య’ లో బుల్ బుల్ గా అందరికి పరిచయం. ఇక మన రాకింగ్ స్టార్ యష్ కూడా మొదట కన్నడ సీరియల్స్ తో మొదలై ఆ తరువాత హీరోగా ఎదిగాడు. ఇక తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా సీరియల్స్ తో మొదలై సినిమాల్లో హీరోగా ఎదిగాడు. ఇక మన టాలీవుడ్ టాప్ హీరో తారక్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ కి వచ్చినా కూడా సీరియల్ లో చేయడం విశేషం. ఇక మరో హీరో తరుణ్ కూడా చిన్న వయసులో సీరియల్స్ లో నటించాడు.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…