Categories: FeaturedMovie News

సునీల్ చేసిన తప్పే సప్తగిరి కుడా చేసాడా? అందుకే కనుమరుగైపోతున్నడా??

ఒకానొక సమయంలో కమిడియన్ గా సూపర్ ఫాంలో ఉన్న సప్తగిరి ప్రస్తుతం ఒక్క సినిమాలో కూడా అయన కనిపించకపోవడం గమనార్హం. ఇక సప్తగిరి పని అయిపోయినట్టే అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అల్లు అర్జున్ నటించిన “దేశముదురు” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సప్తగిరి. ఆ తరువాత వచ్చిన “పరుగు”, “కందిరీగ” వంటి సినిమాల్లో కమిడియన్ గా మంచి గుర్తింపు తెచుకున్నాడు. ఇక “ప్రేమ కధా చిత్రం” సినిమా అయితే అయన కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ చిత్రం ఎంతగా హిట్ టాక్ వచిందో.. అంతకంటే ఎక్కువగా సప్తగిరి కామిడి టైమింగ్ కు బ్రహ్మరధం పట్టారు తెలుగు ప్రేక్షకులు.

ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అదే ఫాం కంటిన్యు అయివుంటే స్టార్ కమిడియన్ గా టాలీవుడ్ లో వెలిగేవాడు సప్తగిరి. అయితే ఆ సమయంలో హీరోగా అవకాశాలు రావడంతో హీరో అవ్వాలనే వ్యామోహంలో పడి కామిడిని పక్కనపెట్టాడనే వాదనలు వినిపిస్తున్నాయి. “సప్తగిరి ఎక్ష్ ప్రెస్”, “సప్తగిరి ఎల్.ఎల్.బీ” వంటి సినిమాలలో హీరోగా నటించాడు. అయితే ఆ సమయంలో హీరోగా చేసినా కామిడిని విడిచిపెట్టను ఆని చెప్పినా… హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో కమిడియన్ గా వచ్చిన చాలా ఆఫర్లను రిజెక్ట్ చేసాడట. ఈ నేపధ్సయంలో సప్తగిరి కోసం రాసిన కొన్ని కామెడి స్క్రిప్ట్ లు ఇతర కమిడియన్లకు హెల్ప్ అయిందనే వాదన వినిపిస్తోంది.

అయితే ఒకానొక సమయంలో స్టార్ కమిడియన్ గా వెలుగు వెలిగిన సునీల్ కూడా హీరోగా సినిమాలు చేసిన సమయంలో కమిడియన్ గా వచ్చిన అవకాశాలను వదులుకున్నాడు. ఆ తరువాత హీరోగా సినిమాలు కూడా తగ్గిపోయాయి. తప్పు తెలుసుకుని ఇప్పుడు మళ్ళి కమిడియన్ గా నిలబడటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నా.. ఆశించినంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నాడనే చెప్పాలి. ఇప్పుడు సునీల్ బాటలోనే సప్తగిరి కూడా నడుస్తున్నాడనే వాదన టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అందువల్లే ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నదని తెలుస్తోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చిల్లర నాణాలతో చరిత్ర సృష్టించిన రైతు.. ద్వారకా తిరుమలకి కానుక!

తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…

23 minutes ago

నమస్కారం ఎందుకు చేస్తారు? ఎవరికి ఎలా చేయాలో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…

29 minutes ago

బట్టలు లేకుండా స్నానం… సంప్రదాయం ఏమంటోంది? నిజం ఏంటి?

ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…

36 minutes ago

భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు తప్పక చేయాల్సిన వ్రతం ఏది?

వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…

43 minutes ago

ఖాళీ కడుపుతో నేరేడు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…

48 minutes ago

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

3 hours ago