Sarath Babu: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శరత్ బాబు మే 22వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ద్వారా పలు విషయాలను తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ మరణిస్తూ ఉండడం తనని చాలా బాధకు గురి చేస్తుందని తెలిపారు. ఇక శరత్ బాబు గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన ఒక గొప్ప నటుడు అనే విషయం మనకు తెలిసిందే. శరత్ బాబు గారి మరణ వార్త తనని ఎంతగానో కలిచి వేసిందని తెలిపారు.
శరత్ బాబు గారు ఎప్పుడు చాలా సరదాగా నవ్వుతూ కనిపించేవారు మా ఇంటి పక్కనే వారి ఇల్లు కూడా ఉండేదని నేను అలా వాకింగ్ వెళ్లిన సమయంలో ఆయన కనిపించే వారిని అయితే ఎప్పుడు చూసిన తను నవ్వుతూనే ఉండే వారని తెలిపారు. ఆయనకు నవ్వు దేవుడిచ్చిన వరం అంటూ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇక శరత్ బాబు గారి వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే.
ఏ మనిషికైనా భరించలేని కష్టాలు వస్తే సన్యాసం తీసుకుంటారు కానీ శరత్ బాబు అలా చేయలేదు. ఆయన భరించలేని కష్టాలు వచ్చిన సమయంలో ఒంటరితనంలోకి వెళ్లిపోయారు. ఒంటరితనం మౌనం ఆయన జీవితంలో భాగమయ్యాయి.మౌనంగా ఆయన ఎన్ని కన్నీళ్లు కార్చారో తెలియదు కానీ కన్నీళ్లను మాత్రం బయటకు రానీయని మహానుభావుడు శరత్ బాబు అంటూ ఈ సందర్భంగా శరత్ బాబు గురించి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…