Sathya Prakash : ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యప్రకాష్ గారు. ఒడిశాలో పుట్టి పెరిగిన సత్య ప్రకాష్ గారు వెంకటేష్ హీరోగా వచ్చిన ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాలో విలన్ గా నటించారు. ఆ సినిమా ద్వారా విలన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. కన్నడ, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ విలన్ గా నటించిన ఆయన తన జర్నీ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక సినిమాల్లో నటించే సమయంలో మొదట్లో ఎదుర్కొన్న అవమానాలను అలాంటి పరిస్థితులను సత్య ప్రకాష్ ఎదుర్కొన్నారా అనే విషయాలను పంచుకున్నారు.
టిఫిన్ కూడా పెట్టకుండా బూతులు తిట్టాడు…
ఇండస్ట్రీ లో గాడ్ ఫాధర్ లేకుండా ఎదిగిన సత్య ప్రకాష్ గారు మొదట్లో చిన్న చిన్న వేషాలను వేసే సమయంలో బాగా ఇబ్బందులను అలాగే అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చెన్నై నుండి ఒక తెలుగు సినిమాలో చిన్న వేషానికి ఒప్పుకుని వస్తే ఇక్కడ ఒక కో డైరెక్టర్ బాగా అవమానించాడు అంటూ చెప్పారు. సుమన్ సినిమాలో నటించేందుకు హైదరాబాద్ వచ్చినపుడు ఒక హోటల్ లో అందరికీ రూమ్ ఇచ్చి నన్ను డోర్ దగ్గర పడుకోమని చెప్పారు. ఇక రూమ్ దాదాపు నాలుగో ఫ్లోర్ లో ఉంది ఉదయం స్నానానికి హాట్ వాటర్ కింద మొదటి ఫ్లోర్ లో వస్తాయి అక్కడ నన్ను ఉండమని ఒక్కొక్కరికి హాట్ వాటర్ వచ్చినపుడు పిలవమని చెప్పారు. అలా చేసినా నేను పట్టించుకోలేదు, ఇక షూటింగ్ లో సుమన్ ను కొడితే నేను పడిపోవాలి నాకు సరిగా రాకపోయే సరికి పక్కకు పంపి వేరే వాళ్ళను తీసుకున్నారు. బయట వచ్చి నిలబడ్డాక ఒక కో డైరెక్టర్ వచ్చి బూతులు తిట్టి ఇలాంటి వాళ్లంతా ఇండస్ట్రీకి వస్తారు అంటూ మాట్లాడినపుడు చాలా అవమానంగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పారు సత్యప్రకాష్.
ఇక అక్కడ రెండు ఇడ్లి పెట్టి ఒక వడ పెడితే నాకు సరిపోలేదు ఇంకొంచం పెట్టండి అని అడిగితే నువ్వు పెద్ద స్టార్ అయ్యాక తిందువు కానీ ఇప్పుడు కాదులే అంటూ మాట్లాడారు. కానీ కొన్నేళ్ల తరువాత అదే కో డైరెక్టర్ నేను క్యారవన్ లో కూర్చొని ఉంటే డైలాగు చెప్పడానికి వస్తే అపుడు అతనికి చెప్పాను కొన్నేళ్ల క్రితం నన్ను ఇలా తిట్టావు కానీ ఇంకెవరినీ అలా తిట్టకు, నీకు వాళ్ళను ప్రోత్సాహించడం రాకపోతే వదిలేయ్ కానీ కనీసం కించపరిచేలా తిట్టకు అని చెప్పాను అంటూ ఆయన అనుభవాలను పంచుకున్నారు.
హనుమంతుడిని భక్తితో ఆరాధిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని హిందూ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అందుకే ప్రతి మంగళవారం, శనివారం…
తెలుగు సినీ పరిశ్రమలో హీరో-హీరోయిన్ల మధ్య వయస్సు తేడా గురించి చర్చలు కొత్తవి కావు. అయితే కొందరు నటులు మాత్రం…
రోజువారీ పనుల్లో చురుకుదనం కోసం సరైన ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్య నిపుణులు తరచూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కుమారుడు తన సొంత తల్లిని అమానుషంగా…
హ్యాపీ డేస్ సినిమాతో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన “టైసన్” పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాల కోసం ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు. ఇలాంటి…