Movie News

Neelima Guna: ఘనంగా నీలిమ గుణ వివాహం… హాజరైన సినీ సెలబ్రిటీలు.. ఫోటోలు వైరల్!

Neelima Guna: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. పౌరాణిక చిత్రాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించే గుణశేఖర్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా కోసం తన కుమార్తె నీలిమను నిర్మాతగా పరిచయం చేశారు.

ఇకపోతే నీలిమ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఈమె వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొద్ది రోజుల క్రితం నీలిమ నిశ్చితార్థం హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్యా వ్యాపారవేత్త శ్రీ శక్తి గ్రూప్ అధినేత కుమారుడు రవి ప్రఖ్యాతో ఈమె నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇకపోతే తాజాగా ఈమె వివాహ బంధం కొత్త జీవితంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. నీలిమ రవిల వివాహం శుక్రవారం రాత్రి 12 గంటల 31 నిమిషాలకు ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం హైదరాబాదులోనే ఫలక్ నుమా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

Neelima Guna: నీలిమ వివాహానికి హాజరైన మెగాస్టార్ దంపతులు…


ఇక ఈ వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నీలిమ గుణ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు, అల్లు అరవింద్ వంటి పలువురు దర్శక నిర్మాతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago