ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మనకు తేలికపాటి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం ఆస్పత్రిలో వెంట, లేబరేటరీలో వెంట పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే శాంపుల్ ఇచ్చినా రెండు మూడు రోజుల తర్వాత గాని ఫలితాలు విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే వ్యాధి తీవ్రత మరింత అధికమవుతుంది. ఇకపై ఈ విధమైనటువంటి కష్టాలు ఉండవని, ఇంట్లోనే ఉంటూ మీరే సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవచ్చని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ భారతదేశంలోనే మొదటి కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ‘కోవీసెల్ఫ్’ ఆవిష్కరించారు.
మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ఆవిష్కరించిన ఈ ‘కోవీసెల్ఫ్’ టెస్టింగ్ కిట్స్ ప్రస్తుతం మార్కెట్లో అమ్మకాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి కిట్స్ మీ దగ్గరలోని ఫార్మసీలలో లేదా ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ విధమైనటువంటి ‘కోవీసెల్ఫ్’ కిట్స్ కేవలం రూ.250 మాత్రమే. భారతదేశంలోని 95% పిన్ కోడ్స్‌కి వీటిని డెలివరీ చేస్తామని మైల్యాబ్ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ కిట్స్ డెలివరీ ఉంటుందని మై ల్యాబ్ ప్రకటించింది.
ఈ విధంగా మై ల్యాబ్ ఆవిష్కరించిన ‘కోవీసెల్ఫ్’ కిట్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR ఆమోదం పొందిన తర్వాత గత నెలలో కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ‘కోవీసెల్ఫ్’ను పరిచయం చేసింది. వీటి ద్వారా ఎవరూ కూడా వ్యాధి నిర్ధారణ కోసం ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెట్టాల్సిన పనిలేదు.ఇంట్లోనే ఉంటూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని తగిన జాగ్రత్తలను పాటించడం ఎంతో వీలవుతుంది.
ఈ క్రమంలోనే ఈ ‘కోవీసెల్ఫ్’ కిట్స్ ద్వారా ఏ విధంగా పరీక్ష చేసుకోవాలో తెలియని వారికి పరీక్ష ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో రూపంలో పొందుపరిచారు. దీని ఆధారంగా కరోనా నిర్ధారణ పరీక్ష ఎంతో సులభంగా చేసుకోవచ్చని మైల్యాబ్ డైరెక్టర్ సుజీత్ జైన్ తెలిపారు. ఒకవేళ ఈ పరీక్ష ద్వారా పాజిటివ్ వచ్చిన వారు మరొకసారి ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని సుజీత్ జైన్ ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…