మనలో కొందరికి ఇంజక్షన్లు వేయించుకోవడం అంటే భయంమే. నిజానికి ఇది ఒక ఫోబియా జనరల్ గా అందరికీ ఉండేదే. అయితే సరిగ్గా ఇలాంటి ఫోబియానే మన కేజీయఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ఉన్నట్టుంది. సినిమాలలో భారీ యాక్షన్ సీన్లతో విధ్వంసం సృష్టించే ప్రశాంత నీల్ ఇలా చిన్న సూదికి భయపడటంతో నెటిజన్లు సరదాగా ప్రశాంత్ నీల్‌ను ఆడేసుకుంటున్నారు.
అసలు విషయానికి వస్తే.. తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఈ విషయాన్ని చెబుతూ ఒక ఫోటోను షేర్ చేశారు. ‘మొత్తానికి నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను.. మీరు ఇంకా వేసుకోలేదా? అయితే త్వరగా వేయించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఆ ఫోటోలో ప్రశాంత్ నీల్ సూది పొడుస్తుంటే కళ్లు మూసుకుని పక్కకు తిరిగి ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ఫోటో చూసిన వెంటనే నటి రవీనా టాండన్ ‘ఇది భలే ఫన్నీగా ఉంది ప్రశాంత్.. నువ్ నా వ్యాక్సినేషన్ వీడియో చూడాల్సింది..’ అంటూ కామెంట్ చేసారు. నటి రవీనా టాండన్ ఇటీవలే కేజీయఫ్ చాప్టర్ 2 లో నటించారు. అయితే దీనిపై స్పందించిన ప్రశాంత్ నీల్.. ‘అవును మేడం మేం ఆ వీడియోను చూడాల్సింది..చూసి వుంటే అది మా అందరినీ మోటివేట్ చేసి ఉండేదేమో అని కౌంటర్ వేశారు. మరోవైపు ప్రశాంత్ నీల్ చిన్న ఇంజక్షన్‌కు భయపడటంతో సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు నెటిజన్లు. కామెంట్స్, మీమ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. పేరుకేమో భారీ యాక్షన్ సినిమాలు తీసే డైరెక్టర్.. ఇంత చిన్న విషయానికే భయపడిపోయారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…