Featured

Raghuvaran : ఆ స్టార్ హీరోయిన్ వల్లే రఘువరన్ తన జీవితం కోల్పోయాడా!? అసలు నిజం ఇదే..!

Raghuvaran : సన్నగా, పొడుగ్గా, కళ్లద్దాలు చాటు మేధావితనంతో కనిపించే రఘువరన్ విలక్షణ నటుడు. ఆయనది ఒక ప్రత్యేకమైన నటనాశైలి, విభిన్నమైన స్వరం. వైవిధ్యమైన ఉచ్చరన. విలక్షణ నటనతోనే అయన సౌత్ సినిమా తెరను ఏలారు. ఎన్నో పాత్రలకు తన ప్రతిభని అద్దారు. మరీ ప్రత్యేకించి ప్రతినాయకుడి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషలు అన్నిటిలోను కలిపి 200 వందల సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు. రఘువరన్ కేరళ రాష్ట్రము, కొల్లెన్ గోడే అనే ప్రాంతంలో వేలాయుధం నాయర్, కస్తూరి ఛాక్కుంగల్ దంపతుల నాల్గవ సంతానంలో పెద్దవాడిగా జన్మించారు.

మొదటగా కన్నడ భాషలో ఒక సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. అలాగే తెలుగులో కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసారు. ఆలా మొదటగా కన్నడ, తెలుగు భాషల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా రఘువరన్. 1979 నుంచి 83 వరకు చెన్నైలోని యాక్టింగ్ ట్రూప్ లోని సభ్యుడిగా ఉన్నారు. ఇదే ట్రూపులో మరో విలక్షణ నటుడు నాజర్ కూడా ఉన్నారు. 1996 లో ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 1998 లో ఒక కుమారు కూడా జన్మించాడు. 2004 లో రోహిణి, రఘువరన్ లు విడాకులు తీసుకున్నారు. 26 సంవత్సరాల కెరియర్లో ప్రతీ పాత్రని తనదైన మానరిజంతో పోషించేవారు.

పెద్ద పెద్ద నటులు హీరోలతోనే శెభాష్ అనిపించుకునేవారు. రఘువరన్ కు ఆయన స్వరం కూడా ఒక అడ్వాంటైజ్ అయింది. పాత్రలకు అనుగుణంగా స్వరాన్ని మార్చేవారు. తనకంటూ సొంత మేనరిజం ని కూడా సృష్టించుకున్నారు రఘువరన్. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. ఎన్నో సినిమాలలో నడక తీరును కూడా మార్చి మరీ ఆయా పాత్రలకు ప్రాణం పోసేవారు. నటనపట్ల వీరు ఇంత అంకిత భావంతో ఉండటంతోనే ప్రేక్షకాదరణ, అభిమాన, పాపులారిటీ సంపాదించుకోగలిగారు. తెలుగులో శివ, ఆహా, సుస్వాగతం, నాగ, జానీ, నాని, మాస్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ చెరగని ముద్రవేశారు.

సుస్వాగతం సినిమాలో కొడుకుని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో ఒదిగిపోయారు రఘువరన్. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్, రఘువరన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో కదిలిస్తాయి. ఇలా ఒక పక్క విలన్ పాత్రలు చేస్తూనే గుండెలు కదిలించే పాత్రలలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రఘువరన్. ఆహ సినిమాలోని జగపతి బాబు సోదరుడి పాత్రలో నటించారు. ఇందులోనూ రఘువరన్ పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. రఘువరన్ 2008 మార్చ్ 19న మరణించారు. రక్తంలో చెక్కెర స్థాయి తగ్గడంతో మరణించారు. ఎన్నో చిత్రాల చిత్రీకరణ సమయంలో అయన అకాల మరణం సంభవించింది. రఘువరన్ అర్ధాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం వల్ల ఎన్నో సినిమాల రిలీజ్ ఆలస్యం అయింది. తెలుగులో రఘువరన్ నటించిన చివరి సినిమా “ఆటాడిస్తా”.

ఇదంతా ఒకెత్తయితే అసలు రఘువరన్ మొదటి నుండి డ్రగ్స్ కి, మద్యానికి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తీరు మార్చుకోకపోవడంతో రోహిణి అతని నుండి విడిపోయింది. రఘువరన్ మత్తులో 24 గంటలు ఉండటానికే ఇష్టపడేవాడు. దానికి కారణం అయన ప్రేమ విఫలం కావడమే అని అంటూ ఉంటారు ఇండస్ట్రీలో కొందరు. అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ ని రఘువరన్ అమితంగా ఇష్టపడ్డారని, కానీ ఆమె మాత్రం ఆయనను పట్టించుకోలేదని, ఆ బాధలోనే రఘువరన్ ఆలా డ్రగ్స్ కి బానిస అయ్యారని చెబుతూ ఉంటారు. ఆ వాదనలో నిజా నిజాలు మనకు తెలియకపోయినా మద్యం మరియూ డ్రగ్స్ కారణంగా ఇండస్ట్రీ మంచి విలక్షణ నటుడుని కోల్పోయిందన్న మాట మాత్రం వాస్తవం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

9 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

9 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

9 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

9 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

9 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

9 hours ago