Categories: FeaturedMovie News

Ilayaraja : బాలుతో సహా ఏ గాయని, గాయకులను నా జీవితంలో మెచ్చుకోలేదు. : ఇళయరాజా

Ilayaraja : 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే.జనాలకు ఈయన “మేస్ట్రో ” అని సుపరిచితం.

2003లో న్యూస్ ఛానల్ “బీ.బీ.సి” నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం “దళపతి” సినిమాలో “అరె చిలకమ్మా” పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.

Ilayaraja: వివాదంలో మ్యూజిక్ మెస్ట్రో… మోడీని అంబేద్కర్ తో పోల్చిన ఇళయరాజా… మండిపడుతున్న నెటిజన్లు!

2015లో గోవాలో జరిగిన 46వ “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా”లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు. 2018లో భారత ప్రభుత్వం ఈయనను “పద్మవిభూషణ్” పురస్కారంతో సత్కరిచింది. బిజెపి ప్రభుత్వం 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది… తెలుగులో 1980 అనంతరం సీతాకోకచిలుక, సితార, సాగర సంగమం,స్వర్ణకమలం లాంటి చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రస్తావిస్తూ.. స్వర్ణకమలం చిత్రంలో ముగ్గురు గాయనీమనులతో మీరు పాడించారు.. ఓ స్వరం ఏ గొంతు నుంచి వినబడాలో ముందుగా ఆలోచిస్తారా.. అంతే శ్రద్ధతో పాటని సమకూర్చుతారని అడగగా.. అది సన్నివేశం, సందర్భం, పాట యొక్క అవసరాన్ని బట్టి చేస్తామని ఇళయరాజా చెప్పారు.

మీ సంగీత సారథ్యంలో ఎంతోమంది గాయనీ గాయకులు పాడి ఉంటారు. అలాంటి క్రమంలో ఏదైనా ఒక పాటలో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన వారిని మీరు మెచ్చుకున్న సందర్భం ఏదైనా ఉందా? అని యాంకర్ అడగగా.. పాటను అర్థం చేసుకొని దానికి తగిన విధంగా స్వరాలను పలుకుతూ పాడితే సరిపోతుంది. ఒకవేళ గాయకుడు, గాయని స్వరాలు తప్పుగా పలికితే మళ్లీ మొదటి నుంచి వాయిద్య కారులు వాయించాల్సి ఉంటుంది. మాకు ఎంతసేపు పాట బాగా వచ్చిందా? లేదా? అనేదే ఉంటుంది. కానీ మరొక ఆలోచన ఉండదు. పాట రికార్డింగ్ విషయంలో నేనెప్పుడూ ఏ గాయని, గాయకులను మెచ్చుకున్న సందర్భాలు లేవని ఇళయరాజా వివరించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago