Indraja : కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా.ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి, శోభ ఈమె చెల్లెళ్లు. ఆమె అసలు పేరు రజతి. పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.
ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి ఆలీ హీరోగా తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ తీసిన “సొగసు చూడతరమా” సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మలయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.
అయితే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ.. యమలీల చిత్రం విజయవంతం తర్వాత ‘అమ్మ దొంగా’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అలా సెట్ లోకి వెళ్ళినప్పుడు దర్శకుడు సాగర్ ఓ ఈ అమ్మాయా చాలా చిన్న వయసు అని అన్నారు. ఏంటో నాకు అర్థం కాలేదు. అలా అనడంతో.. తిరిగి ఇంటికి వెళ్లి పోయాను. మళ్ళీ ఆ బ్యానర్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు హీరోయిన్ గా ఆ సినిమాలో అవకాశం ఉందని సంతోషపడ్డాను. ఆ క్రమంలో నేను చెన్నై క్రిస్టియన్ స్కూల్లో చదవడం మూలంగా కాలు మీద కాలు వేసుకోవడం అలవాటు అయిపోయింది. అప్పుడు అమ్మ దొంగా సినిమా షూటింగ్ విరామంలో.. కాలు మీద కాలు వేసుకుంటే అలా వేయకూడదని అనేవారు.
కానీ హీరో కృష్ణ నేను కాలు మీద కాలు వేసుకున్న, నేను ఎలా కూర్చున్న ఆయన ఏమనేవారు కాదు. నేను గుడ్ మార్నింగ్ చెప్పిన, గుడ్ ఈవినింగ్ చెప్పిన ఆయన తల ఊపేవారు కానీ ఏం మాట్లాడేవారు కాదు, నా యాక్టింగ్ బాగోలేదని ఆయన అలా అంటున్నారని నేను అనుకున్నాను. షూటింగ్ అయిపోయి ఇంటికెల్లాకా బాగా ఏడ్చాను. సెట్ లో కృష్ణ గారు అలానే ఉంటారని అందరూ అనేవారు. అలా మెల్లిగా షూటింగ్ కు వెళుతుండడంతో.. ఆయన గురించి అర్థమైంది. హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్ అని ఇంద్రజ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…