Movie News

Senior Journalist Bhardwaja : ఓ టాప్ డైరెక్టర్ చేత చెంప దెబ్బ… ఆ దర్శకుడి మీదకి కుక్కలను వదిలిన నిర్మాత కాట్రగడ్డ మురారీ… చిరంజీవి, రాఘవేంద్రరావు మీద కాట్రగడ్డ విమర్శలు : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్

Senior Journalist Bhardwaja : సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి గారు 78 ఏళ్ల వయసులో శనివారం నాడు అనారోగ్య సమస్యలతో ఆయన చెన్నై లోని ఆయన స్వగృహం లో తుదిశ్వాస విడిచారు. ‘సీతామహాలక్ష్మి’ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురారి గారు తన ముక్కుసూటి తనం వల్ల ఇండస్ట్రీలో చాలా మందితో వైరం, వివాదాలు పెట్టుకున్నారు. సీతామహాలక్ష్మి, గోరింటాకు, జే గంటలు, త్రిశూలం, నారీ నారీ నడుమ మురారీ, జానకి రామూడు, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలను నిర్మించారు. సినిమా తీయడంలో నిర్మాత కు గౌరవం తగ్గిపోతోంది అని ఆయన సినిమా నిర్మాణానికి దూరంga ఉండిపోయారు. అయితే ఆయన ఆత్మ కథ ‘నవ్విపోదురుగాక’ అనే పేరు తో ఇండస్ట్రీలో ఉన్న చాలా మందిపై విమర్శలు చేసారు. ముఖ్యంగా రాఘవేంద్ర రావు, చిరంజీవిలను విమర్శించారు. ఇక ఆయన శైలి, ఆయన ప్రస్థానం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అనుభవాలను పంచుకున్నారు.

ఆ డైరెక్టర్ మీద కోపంతో కుక్కలను వదిలిన కాట్రగడ్డ మురారి…

కాట్రగడ్డ మురారి గారి కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో ముందు నుండి అనుబంధం ఉండేది. ఆయన పెద్ద నాన్న కాట్రగడ్డ మధుసూదన రావు గారు సినిమాల్లో ఉన్నారు. నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా పంపినీ లో కుటుంబం ఉంది. ఇక కాట్రగాడ్డ మురారి గారికి చిన్నపుడు చదువు చెప్పిన వీరమాచినేని మధుసూదనరావు గారు క్లాస్ లో ఎవరైనా సరిగా చదవకపోతే కొట్టేవారట అలా ఒకసారి మురారి గారిని కొట్టారట దీంతో కోపం పెంచుకున్న మురారి గారు ఆయన వారి వీధిలో వెళుతుంటే కుక్కలను ఉసిగొల్పి ఆయన మీదకు వదిలాడట. ఇక మెడిసిన్ చదువుతున్న మురారి గారు సినిమాల మీద ఇష్టంతో డైరెక్టర్ అవుతానని ఇంట్లో అడిగి చెన్నై వెళ్ళాడట. అక్కడ చిన్నపుడు టీచర్ అయిన వి మధుసూదన్ రావు గారు అప్పటికే డైరెక్టర్ అయ్యారు ఆయన వద్ద శిష్యరికం చేశారు.

ఇక ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్నపుడు అక్కడే అసిస్టెంట్స్ గా ఉన్న రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు ఇద్దరూ స్నేహితులు అయ్యారు. ఇక డైరెక్టర్ గా కాకుండా నిర్మాత వారితో సినిమాలను చేసిన కాట్రగడ్డ తన ఆత్మకథ పుస్తకం లో మాత్రం రాఘవేంద్రరావు ను బాగా విమర్శించారు. పాటలు తీయాలంటే బత్తాయి పళ్ళు లారీ కావాలా అంటూ కామెంట్స్ చేశారు. ఇక మీరు చిరంజీవి తో ఎందుకు సినిమా చేయలేదని అడిగితే కాట్రగడ్డ గారు ఆయనతో సినిమా చేయనందుకే ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చెప్పారట. ఆ మాటకు చిరంజీవి గారు కూడా ఆయనతో సినిమా చేయనందుకు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని కౌంటర్ ఇచ్చారట. ఇలా కాట్రగడ్డ మురారి గారు ఆయన కు నచ్చింది మాట్లాడేవారు దీనివల్ల ఎంతో మంది వ్యతిరేకులను తయారుచేసుకున్నారు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago