Senior Journalist Bhardwaja : తెలంగాణ ఉప ఎన్నిక ఎంత రసవత్తరంగా మారిందో అందరికీ తెలుసు. ఆల్రడీ సిట్టింగ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి బీజేపీ లోకి వెళ్లిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక కాంగ్రెస్ స్థానం నిలుపుకోవడం కోసం కష్టపడితే ఎలాగైనా గెలిచి బీజేపీ బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. ఇక అధికార పక్షమైన తెరాస కోల్పోయిన స్థానాన్ని మళ్ళీ దక్కించికోవాలని సర్వ శక్తిలు ప్రయోగించింది. అయితే ప్రచారం ముగిసి ఎన్నిక జరిగే రోజుకు వచ్చేసరికి బీజేపీ, తెరాస మాత్రమే మిగిలాయి. కాంగ్రెస్ మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయింది. అయితే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడిన తెరాస బీజేపీ లలో తెరాస గెలవడానికి గల కారణాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.
తెరాస గెలవడానికి కారణం బీజేపీ నే…
భరద్వాజ గారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లో చాలా వరకూ కమ్యూనిస్ట్ సానుభూతిపరులు ఉన్నారని చెబుతూ అలాగే కాంగ్రెస్ కు సంప్రదాయక ఓటు బ్యాంకు ఉందంటూ చెప్పారు. ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ ఎలక్షన్స్ లో ప్రత్యర్థి గా తప్పుకోవడం వల్ల తెరాస వైపు మొగ్గు చూపాయి అంటూ అభిప్రాయపడ్డారు. తెరాస వైపు ఈ రెండు వర్గాలు మొగ్గుచుపడానికి బీజేపీ కారణమైందంటూ చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రచారం సమయంలో వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా తెరాస కు కలిసోచ్చాయని చెప్పారు. ఓటమిని బీజేపి ఎనిమిదో రౌండ్ లోనే ఉహించి ఈటెల రాజేంద్ర గారు ఓటమికి కారణంగా కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఓట్లు తెరాస కి పడ్డాయాంటూ చెప్పడం వాళ్ళు ఓటమిని ముందే గ్రహించడానికి నిదర్శనం అంటూ చెప్పారు.
బీజేపీ హిందూత్వ కార్డు ఇక్కడ పనిచేయలేదని ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ను బీజేపీ భయపెట్ట లొంగదీసుకోవడం మళ్ళీ ఎలక్షన్ వచ్చేలా చేయడం వల్ల అక్కడి ప్రజలకు బీజేపీ పై కొంత వ్యతిరేకత ఏర్పడింది అంటూ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మధ్యలో మిడిల్ డ్రాప్ అవడం వల్ల తెరాస లాభపడిందని చెప్పారు. అయితే ఈ ఎన్నిక రాబోయే సర్వత్ర ఎన్నికలకు కొలమానం కాదని, ఉప ఎన్నికలో ఆ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు వేరు మొత్తం దేశం లో జరిగే ఎన్నికల సమయంలో అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అంటూ భరద్వాజ గారు చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…