Featured

Senior Journalist Narra Vijay : తెలంగాణ లో బీజేపీ గెలిస్తే బండి, ఈటెల, కిషన్ ఈ ముగ్గురిలో సీఎం అభ్యర్థి ఎవరు…: సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్

Senior Journalist Narra Vijay : వచ్చే ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు అలాగే పార్లమెంటు కు ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ఎన్నికలకు ఇంకా చాలా రోజులున్న అభ్యర్థుల జాబితా ప్రకటించి ఆశ్చర్య పరిచారు. 119 నియోజకవర్గాలకు దాదాపు అభ్యర్తులను ప్రకటించిన కెసిఆర్ మరోవైపు సీఎం అభ్యర్థి ఈసారి కూడ నేనే అంటూ క్లారిటీ ఇచ్చేసారు. ఇక కెసిఆర్ ఇంత ఫాస్ట్ గా అన్ని చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్, బిజెపి మాత్రం అసలు తమ నేతలలో ఎవరు సీఎం అభ్యర్థి కూడ తెలియని తికమక లో ఉన్నారు. ఇక బీజేపీ నుండి సీఎం అభ్యర్తి ఎవరు ఉండొచ్చనే అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ మాట్లాడారు.

బీజేపీ నుండి సీఎం అభ్యర్థి ఎవరు….

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు బీజేపీ కి చాలా కీలకం. దక్షిణాదిన ఎంతో కొంత బీజేపీ ఆశలు పెట్టుకోగల రాష్ట్రం అదే. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పరాభావం తరువాత బీజేపీ ఆశలు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నాయ్. కాంగ్రెస్ ను పక్కకు నెట్టి తాను సెకండ్ ప్లేస్ లో ఉండాలని చాలా ప్రయత్నిస్తున్న బీజేపీకి అసలు వాళ్ళ రాష్ట్ర నాయకత్వంలో సీఎం అభ్యర్థి ఎవరన్నది వారికే తెలియదు. ఇటువైపు కెసిఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి యుద్ధనికి సిద్ధం అంటుంటే ఇటు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ల నాయకుడేవరో తేల్చుకోవడం లేదు.

ముఖ్యంగా బీజేపీలో బండి సంజయ్ అసలు ఎమ్మెల్యే గా పోటీ చేస్తాడా ఎంపీగా పోటీ చేస్తాడా అనే విషయం కూడ క్లారిటీ లేదు. మరోవైపు ఈటెల రాజేంద్ర తన పాత నియోజకవర్గం నుండే పోటీ చేస్తాడా లేక మార్చుకుంటాడా అనే విషయం క్లారిటీ లేదు. ఇక బీజేపీ లీడ్లర్లో వినీపించే ముఖ్యమైన నాయకులు బండి సంజయ్, ఈటెల, కిషన్ రెడ్డి, వీరి ముగ్గురిలో అసలు ఎవరు సీఎం అభ్యర్తిగా ఉంటారో అన్నది పార్టీ లో ఎవరికీ క్లారిటీ లేదు. బీజేపీ హై కమాండ్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి సీఎం అభ్యర్థి ఎవరో క్లారిటీ ఇస్తేనే ఆ పార్టీ కార్యకర్తలలో ఊపు వస్తుందన్నదీ వాస్తవం అంటూ విజయ్ అభిప్రాయాడ్డారు. ఇటు కాంగ్రెస్ లో కూడ పరిస్థితి అలానే ఉంది సీఎం అభ్యర్థి ఎవరు అంటే సీనియర్ నేతలందరు తామే అంటూ చేతులెత్తుతారు. ఈ రెండు పార్టీలలోని ఈ పరిస్థితి గులాబీ బాస్ కి మాంచి అడ్వాంటేజ్ అయింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago