Featured

Shaking Sheshu : కిర్రాక్ ఆర్పి విమర్శలపై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏమన్నారంటే, ఒకసారి మల్లెమాల వదిలి వెళ్ళిపోతే ఇక అంతే : షేకింగ్ శేషు

Shaking Sheshu : కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ మీద చేసిన ఆరోపణల సెగ ఇంకా తగ్గలేదు. కిర్రాక్ ఆర్పి చేసిన తీవ్ర ఆరోపణల నడుమ షేకింగ్ శేషు జబర్దస్త్ మేనేజ్‌మెంట్ ను అక్కడి పరిస్థితులను వివరించారు. తిండి బాగోలేదంటూ కిర్రాక్ ఆర్పి చేసిన వాఖ్యలను ఖండించాడు. రోజుకు రెండోందలమందికి పైగా వ్యక్తులకు అన్నం పెట్టే సంస్థలో పంచభక్ష్య పరమాన్నలను ఎలా కోరుకుంటారు అంటూ మాట్లాడారు.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అలా అన్నారు…

అయినా తిండి కోసం మల్లెమాల సంస్థకు వెళ్తారా లేక పని కోసం వెళ్తామా, నీకు అంత తినలేక పోతే బయట తెప్పించుకుంటే సరిపోతుంది కదా, ఆ మాత్రం దానికోసం నీకు జీవితాన్నిచ్చిన సంస్థను దూషించడం ఏంటి అంటూ అన్నారు. ఇంట్లో తిండి రుచిగా లేదని అమ్మ ను తిడతామా లేదు కదా మరి తల్లి లాంటి జీవితాన్ని ఇచ్చిన సంస్థను ఎలా విమర్శిస్తారు, అలా చేయకూడదు కదా. ఇక ఈ మ్యాటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి వద్ద ఎవరో ప్రస్తావించగా మన వాడే కదా పోనిలే వదిలేయండి, మన కుటుంబం నుండి వెళ్లినవాడే తెలియక మాట్లాడాడు వదిలేయండి అని అన్నారట.

ఇక శ్యామ్ ప్రసాద్ గారు ఇలాంటి విషయాలను పట్టించుకోరని అయితే ఆయనలో ఉన్న గొప్పలక్షణం ఒకసారి సంస్థలు వదిలి వెళ్ళిన వారు ఎంత ఫేమస్ అయినా మళ్ళీ సంస్థలోకి తీసుకోరని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి షేకింగ్ శేషు చెప్పారు. మల్లెమాల లో ఉంటూ ఎంతమంది బయట సినిమాల్లోనూ ఈవెంట్లలోనూ చేస్తున్నారు. అది కాక కిర్రాక్ ఆర్పి తప్పితే ఇంకెవరూ మల్లెమాల సంస్థలు గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ ప్రతి జబర్దస్త్ సభ్యుడు స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే జనాలు కిర్రాక్ ఆర్పి చెప్పిన విషయాలను నిజం అనుకుంటారు అంటూ చెప్పాడు.

Bhargavi

Recent Posts

సముద్ర మధ్యలో హంటా వైరస్ కలకలం.. అప్రమత్తమైన WHO, ప్రత్యేక ఆపరేషన్‌తో ప్రయాణికుల రక్షణ

అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ అనుమానిత కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది.…

7 minutes ago

విజయ్ సీఎం ఆశలకు గవర్నర్ బ్రేక్.. తమిళనాడులో రాజకీయ టెన్షన్!

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్న టీవీకే నేత విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర…

41 minutes ago

వేసవిలో ఈ డ్రింక్ తాగితే చాలు.. డీహైడ్రేషన్ నుంచి బరువు తగ్గే వరకు ఎన్నో ప్రయోజనాలు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న వేళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో నీటితో పాటు ఆరోగ్యానికి మేలు…

4 hours ago

ఐస్ క్యూబ్స్ వాసనతో ఇబ్బందా? కిచెన్‌లో ఉన్న వాటితోనే సింపుల్ సొల్యూషన్!

ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఫ్రిజ్ వినియోగం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లని నీరు, ఐస్ క్యూబ్స్ లేకుండా చాలామందికి రోజు…

4 hours ago

విఘ్నాలను తొలగించే మహా గణనాథుడు.. భక్తులతో కిటకిటలాడుతున్న తెలంగాణ క్షేత్రాలు!

విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ.…

4 hours ago

సీతారాముల జ్ఞాపకాలతో నిండిన పవిత్ర క్షేత్రాలు.. ఒక్కసారి దర్శిస్తే చాలు!

భారతీయ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి జీవితం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. త్రేతాయుగంలో జరిగిన ఈ మహాగాథతో…

5 hours ago