Shaking Sheshu : కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ మీద చేసిన ఆరోపణల సెగ ఇంకా తగ్గలేదు. కిర్రాక్ ఆర్పి చేసిన తీవ్ర ఆరోపణల నడుమ షేకింగ్ శేషు జబర్దస్త్ మేనేజ్‌మెంట్ ను అక్కడి పరిస్థితులను వివరించారు. తిండి బాగోలేదంటూ కిర్రాక్ ఆర్పి చేసిన వాఖ్యలను ఖండించాడు. రోజుకు రెండోందలమందికి పైగా వ్యక్తులకు అన్నం పెట్టే సంస్థలో పంచభక్ష్య పరమాన్నలను ఎలా కోరుకుంటారు అంటూ మాట్లాడారు.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అలా అన్నారు…
అయినా తిండి కోసం మల్లెమాల సంస్థకు వెళ్తారా లేక పని కోసం వెళ్తామా, నీకు అంత తినలేక పోతే బయట తెప్పించుకుంటే సరిపోతుంది కదా, ఆ మాత్రం దానికోసం నీకు జీవితాన్నిచ్చిన సంస్థను దూషించడం ఏంటి అంటూ అన్నారు. ఇంట్లో తిండి రుచిగా లేదని అమ్మ ను తిడతామా లేదు కదా మరి తల్లి లాంటి జీవితాన్ని ఇచ్చిన సంస్థను ఎలా విమర్శిస్తారు, అలా చేయకూడదు కదా. ఇక ఈ మ్యాటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి వద్ద ఎవరో ప్రస్తావించగా మన వాడే కదా పోనిలే వదిలేయండి, మన కుటుంబం నుండి వెళ్లినవాడే తెలియక మాట్లాడాడు వదిలేయండి అని అన్నారట.

ఇక శ్యామ్ ప్రసాద్ గారు ఇలాంటి విషయాలను పట్టించుకోరని అయితే ఆయనలో ఉన్న గొప్పలక్షణం ఒకసారి సంస్థలు వదిలి వెళ్ళిన వారు ఎంత ఫేమస్ అయినా మళ్ళీ సంస్థలోకి తీసుకోరని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి షేకింగ్ శేషు చెప్పారు. మల్లెమాల లో ఉంటూ ఎంతమంది బయట సినిమాల్లోనూ ఈవెంట్లలోనూ చేస్తున్నారు. అది కాక కిర్రాక్ ఆర్పి తప్పితే ఇంకెవరూ మల్లెమాల సంస్థలు గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ ప్రతి జబర్దస్త్ సభ్యుడు స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే జనాలు కిర్రాక్ ఆర్పి చెప్పిన విషయాలను నిజం అనుకుంటారు అంటూ చెప్పాడు.






























