Sharukh Khan : ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి ఒకరకంగా స్వర్ణ యుగమనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లోనే కాక అటు ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపు తెచ్చుకోవటమే కాక మంచి హిట్లు గా నిలబడుతున్నాయి. ఇక సౌత్ నుండి ఈ మధ్య విడుదలైన కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, విక్రమ్ సినిమాలు బాలీవుడ్ లోను బాగా హిట్ అయ్యాయి. ఇక బాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు అంతగా హిట్ అవ్వడం లేదు. అక్కడే హిట్ అవ్వడం లేదు ఇక సౌత్ ఇండస్ట్రీలో ఇంకేం నిలబడతాయి. దీంతో బాలీవుడ్ సినిమా మేకర్స్ కు సౌత్ సినిమాలమీద అక్కసును ఏదో ఒక సందర్బంలో చెబుతూనే ఉన్నారు.
కేజీఎఫ్ ను షారుఖ్ చేసి ఉంటే చూసే వాళ్ళు కాదు…
ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో పెను సంచలనం సృష్టించిన కేజీఎఫ్ 2 సినిమా బాలీవుడ్ జనాలకు మింగుడుపడనీయలేదు. తాజాగా విడుదలైన సినిమా ‘రాష్ట్ర కవచ్ ఓం’ సినిమా రచయిత రాజ్ సులుజా సౌత్ సినిమాల గురించి హాట్ కామెంట్స్ చేసాడు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది వాళ్లకు సౌత్ సినిమాలమీద ప్రేమ ఎక్కువైంది.
ఒకవేళ కేజీఎఫ్ సినిమాను యష్ తో కాకుండా షారుఖ్ ఖాన్ తో తీసినా బాలీవుడ్ జనాలు ఒప్పుకోరు. ఆ సినిమా హిట్ అయ్యేది కాదు. సత్యమేవ జయతే సినిమా తీస్తే జాన్ అబ్రహం, ఆ సినిమా డిజాస్టర్ అయింది. అదే సౌత్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్, అల్లు అర్జున్ వంటి వారు తీస్తే సినిమాలు చూడ్డానికి బాలీవుడ్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అసలు బాలీవుడ్ హీరోలు అలాంటి సినిమాలు తెస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు అంటూ తన ఆవేదనను తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…