ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీస్తూ వాటిని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కోవడంతో పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ నెల 23 వరకు అతని కస్టడీలో ఉంచనున్నారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా అరెస్టు కావడంతో 10 సంవత్సరాల క్రితం అతను చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ బిజినెస్ మాన్ రాజ్ కుంద్రా పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారనే ఆరోపణలు కారణంతో అతనితో పాటు మరో 11 మందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ విధంగా ముంబై పోలీసులు వీరిని అరెస్టు చేయడంతో ఈ విషయం కాస్త బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
2021 మార్చి నెలలోనే ఈ ఆరోపణలు రావడంతో పోలీసులు రాజ్ కుంద్రా పై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇతను అరెస్టు కావడంతో గతంలో ఇదే విషయానికి సంబంధించి అతను చేసిన ట్వీట్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 2012 మార్చి 29 వ తేదీ వ్యభిచారానికి, పోర్న్‌కు లింక్ పెడుతూ పోర్న్ VS ప్రాస్టిట్యూషన్ అనే పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.10 సంవత్సరాల క్రితం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ ఎంతటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాలంటే 23వ తేదీ వరకు వేచి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…