దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మార్చి నెల 25 నుంచి బస్సు ప్రయాణాలపై ఆంక్షలు అమలయ్యాయి. అయితే అన్ లాక్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగించింది. అయితే కేంద్రం అనుమతులు ఇచ్చినా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఆంక్షలను తొలగించలేదు. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చాలాసార్లు చర్చలు జరిగినా ఆ చర్చలు ఫలించలేదు.
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీ నుంచి హైదరాబాద్ కు పండగ బస్సులు లేనట్లేనని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం 1,61,000 కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని చెబుతున్నా తెలంగాణ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో దసరాకు సర్వీసులు నడపడం సాధ్యం కాదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏపీకి రావాలనుకునే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికే టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు నడవకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. కనీసం కొన్ని సర్వీసులకైనా తెలంగాణ ఆర్టీసీ అనుమతులు ఇస్తే బాగుంటుందని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్ – కర్నూలు రూట్లలో వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భారీగా టికెట్ రేట్లు పెరగనున్నాయి.
కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికే ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ రేట్లను పెంచడం అంటే ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణ అంతర్రాష్ట్ర సర్వీసులపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…