Sree Bharath: నందమూరి బాలయ్య చిన్నల్లుడు తెలుగుదేశం యువ నాయకుడు శ్రీ భరత్ ఒంటరి వారు అయ్యారా అంటే అవుననే తెలుస్తుంది. ఈయన వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా గత ఎన్నికలలో పోటీ చేశారు. అయితే గత ఎన్నికలలో భాగంగా ఈయనకు నారా నందమూరి కుటుంబాల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించింది.
ఈ విధంగా గత ఎన్నికలలో ఈయనకు భారీ ఎత్తున మద్దతు లభించిన అక్కడ మాత్రం గెలుపు అందుకోలేకపోయారు. అయితే ఈసారి కూడా బిజెపిని కాదని ఎన్నో త్యాగాలు చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు బాలయ్య చిన్నల్లుడు భరత్ కి విశాఖ ఎంపీగా టికెట్ ఇచ్చారు. అయితే ఈయన ఈసారి గెలుస్తారనే దీమాతో అందరూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
విశాఖను రాజధానిగా చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లారు. ఇదే ఈయనకు మైనస్ గా మారిందని తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ గెలుస్తామా లేదా అన్న నమ్మకాలు తెలుగుదేశం పార్టీ అధినేతలలో కూడా ఉన్నాయని అందుకే ఇక్కడ పార్టీ తరఫున మద్దతు తెలియజేయడానికి నారా నందమూరి కుటుంబాలు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినప్పటికీ పెద్దగా జనాలలోకి అది వెళ్లలేదని చెప్పాలి.
ఒంటరి పోరాటం..
ఇక భరత్ దూకుడు స్వభావం లేనటువంటి నాయకుడు కావడంతో ప్రచార కార్యక్రమాలలో కూడా వెనుకబడ్డారు. ఇక ఈయన క్యాడర్ తన వైపు తిప్పుకోవడం, లోకల్ గా ఉన్నటువంటి నాయకులను దగ్గరకు చేర్చుకొని వారితో కలిసి ముందుకు వేస్తూ ప్రచార కార్యక్రమాలను చేయటంలో పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తోంది. మరి ఒంటరిగానే తన భార్య తేజస్వినితో కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి భరత్ ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది ఆసక్తిగా నెలకొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…