తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అమింజికరై రైల్వే కాలనీలో 3వ వీధికి చెందిన మహేష్ (45)కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు గత కొన్ని సంవత్సరాల తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. దీంతో అది శిథిలావస్థకు చేరుకుంది. ఓ రోజు ఆ ఇంటిని శుభ్రం చేయడానికి యజమాని తాళం తీసేందుకు వచ్చాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అదేంటంటే.. తాళం తీయగానే ఒక్కసారిగా అస్థిపంజరం బయటయపడింది. దీంతో ఆ కుటుంబంలో భయాందోళన మొదలైంది. వెంటనే పోలీసులు సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి పరిశీలించి ఆ అస్థిపంజరం ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిదేనంటూ పోలీసులు నిర్థారించడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లభ్యమైన అస్థిపంజరం.. మహేష్ అన్న రమేష్ (49) ది అని పోలీసులు నిర్థారించారు.
అతడికి పెళ్లి కాకపోవడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడని తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన రమేష్ రెండేళ్ల నుంచి కనిపించకుండా పోయాడని.. అతని జాడ గురించి ఎవరికీ తెలియదని పోలీసులు తెలిపారు. ఈ అస్థిపంజరాన్ని పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డీఎన్ఏ రిపోర్టు అనంతరం ఇది ఎవరి అస్థిపంజరమో తేలుతుందని పేర్కొన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తప్పిపోయిన అన్న ఇలా అస్థిపంజరమై కనిపించడంతో మహేష్ కన్నీరమున్నీరుగా విలపించడాడు. దీంతో ఆ వీధిలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…