Sree Leela: రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో తెరికెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల.మొదటి సినిమాతోనే తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సందడి చేసిన ఈమెకు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా శ్రీ లీల వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండగా తన తల్లి మాత్రం ఓ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెపై కర్ణాటకలోని అడిగుడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. అసలు ఈమెపై పోలీసు కేసు నమోదు కావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నటి శ్రీ లీల తల్లిదండ్రులు సుమారు 20 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే గతంలో శ్రీ లీల తండ్రి శుభకర్ రావు మాట్లాడుతూ శ్రీ లీల తనకు పుట్టిన బిడ్డ కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీ లీలా తండ్రి శుభకర్ రావు తన తల్లి స్వర్ణలతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఈయన ఇచ్చిన ఫిర్యాదులో స్వర్ణలత అక్టోబర్ మూడవ తేదీ బెంగళూరులోని కోరమంగళలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి ఎటువంటి అనుమతి లేకుండా ప్రవేశించిందని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా తన అనుమతి లేకుండా తన అపార్ట్మెంట్ తాళాలు పగలగొట్టి ఈమె ఇంట్లోకి అక్రమంగా చొరబడింది అంటూ శుభకర్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీ లీల తల్లి స్వర్ణ లత పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. మరి ఈ విషయం పై స్వర్ణలత ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…