Movie News

Sreeja Konidela: 14 ఏళ్ల వయసులో పరిచయమైయ్యావ్….శ్రీజ పోస్ట్ వైరల్!

Sreeja Konidela: చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి కుమార్తెగా అందరికీ పరిచయమైన శ్రీజ ఆమె వ్యక్తిగత విషయాల వల్ల బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా శ్రీజ పెళ్ళి, విడాకుల విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన మెగా కుటుంబానికి చెందిన శ్రీజ అతి చిన్న వయసులోనే ఒక వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి మరి వివాహం చేసుకుంది.

అతనితో సంతోషంగా ఉంటూ ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల శ్రీజ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి దూరం అయింది. ఆ తర్వాత కొంతకాలానికి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల ఆమోదంతో అందరి సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది. అయితే ఒక పాప పుట్టిన తర్వాత కళ్యాణ్ దేవత కూడా శ్రీజ కి విభేదాలు రావటంతో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. రెండవ భర్తతో కూడా శ్రీజ విడాకులు తీసుకున్నట్లు చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా శ్రీజ మూడవ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీజ ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల శ్రీజ షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. గతంలో కూడా న్యూ ఇయర్ సందర్భంగా శ్రీజ తన కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంటూ పోస్ట్ చేయటంతో ఆ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఆ వార్తల వల్ల శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందని అందరూ భావించారు.

Sreeja Konidela: కాఫీ పై ప్రేమను చూపిన శ్రీజ…


తనతో తాను ప్రేమలో పడినట్లు శ్రీజ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా కాఫీ పట్ల తనకు ఎంత ఇష్టం ఉందో ఈ పోస్ట్ ద్వారా తెలియజేసింది. “నా అల్లరికి ప్రశాంతతను ఇచ్చేది నువ్వే.. చీకటి నిండిన జీవితంలో వెలుగులు నింపేది నువ్వే… నేను ఉదయమే నిద్రలేస్తున్నానంటే అందుకు కారణం నువ్వే.
నా 14 ఏళ్ల వయసులో నువ్వు (కాఫీ) నాకు పరిచయం అయ్యావు. అప్పటినుంచి నాతోనే ఉంటున్నావు. థాంక్యూ సో మచ్ మై డియర్ కాఫీ ” అంటూ కాఫీ పై తనకి ఉన్న ప్రేమను తెలియజేస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

11 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

12 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

17 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

17 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

17 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

17 hours ago