Categories: FeaturedMovie News

Ram Gopal Varma : నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయింది… తన కోసమే ఆ సినిమాకు సత్య అని పేరు పెట్టాను…: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అనగానే తేడా మనిషి అనేవాళ్ళు ఉన్నారు బతికితే ఆర్జివి లాగా బతకాలి అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఫ్రీడమ్ వచ్చిన ఏకైక వ్యక్తి కేవలం ఆర్జివి మాత్రమే అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారు. నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టు ఉంటా అనేది ఆర్జివి తీరు. అయితే ఏదో ఒక ఒకవిషయంలో కాంట్రావెర్సీ క్రియేట్ చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఉండే ఆర్జీవి, సినిమాకు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి, తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయినా తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రం ఎదురుచూస్తుంటారు. అయితే అతను ఒకప్పుడు తీసిన క్లాసిక్ సినిమాల నిర్మాణం గురించి తాజాగా ఇంటర్వ్యూలో వర్మ ఇంట్రస్టింగ్ విషయాలను తెలిపారు.

సత్య సినిమాకు ఆ పేరు ఎలా పెట్టానంటే…

వర్మ తీసిన సినిమాల్లో బాగా చెప్పుకోదగ్గ సినిమాలు అంటే శివ, రంగీలా మరీ ముఖ్యంగా సత్య. అప్పట్లోనే మాఫియాను సరికొత్తగా చూపించిన వర్మ ఆ సినిమా పేరు గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. సత్య సినిమా పేరు తాను ప్రేమించిన అమ్మాయి పేరు అంటూ చెప్పారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదవే సమయంలో అక్కడే మెడికల్ కాలేజీ లో చదువుకునే సత్య అనే అమ్మాయిని బాగా ప్రేమించాడట వర్మ.

ఆ అమ్మాయి తరువాత అమెరికా వెళ్ళిపోయిందట. అందుకే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చూడు అన్నట్లుగా ఆ సినిమాకు సత్య అని పేరు పెట్టాడట వర్మ. అంతేకాకుండా క్షణక్షణం సినిమాలో హీరోయిన్స్ కి కూడా సత్య అనే పేరును పెట్టాడట వర్మ. ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నానంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago