Categories: FeaturedMovie News

Megastar Chiranjeevi : చిరంజీవిని తొలినాళ్లలో భయపెట్టిన ఆ నిర్మాత… హీరోగా ఇస్తానని చెప్పి మోసం…!

Megastar Chiranjeevi : ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్లకు ఆదర్శంగా నిలబడే స్థాయికి ఎదిగిన చిరు గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలను చూస్తూ ఆయనను అభిమానించే ఎన్నో కోట్లమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడం చేయలేదు. వేరొకరు ఆయన మీద బురదజల్లినా కూడా ఓర్పుగా వ్యవహారించారు కానీ ఎవరితోను పరుషంగా మాట్లాడలేదు. పెద్ద హీరో అయిన తరువాత కూడా అలానే ఉన్న చిరు కెరీర్ తొలినాళ్ళలో ఇలాంటి నేచర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భయపెట్టిన ఆ నిర్మాత ఎవరంటే…

సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఒక గాడ్ ఫాదర్ అనేవాడు లేకుండా తన నిర్ణయాలు, తన కష్టం అన్నట్లుగా పైకి వచ్చిన చిరంజీవి గారు తొలి రోజుల్లో చిన్న పాత్రలను చేసి ఇబ్బందులను ఎదుర్కోంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అలాంటి సమయంలో ఎవరినీ నొప్పించకుండా చెడు సావాసాలకు పోకుండా కష్టపడి అవకాశాలను సంపాదించుకున్న చిరుకి అనతి కాలంలో హీరో అవకాశాలు వచ్చాయి. అలాంటి సమయంలో అడవిరాముడు వంటి పెద్ద హిట్ ఇచ్చిన సత్య చిత్ర ప్రోడస్షన్స్ నుండి పిలుపు వచ్చింది. నిర్మాత సత్యనారాయణ, సూర్య నారాయణలు చిరుని పిలిచి కృష్ణ గారు హీరోగా చేస్తున్న ఈ సినిమాలో విలన్ రోల్ అదికూడా సెకండ్ విలన్ రోల్ ఇస్తామని చెప్పారట. అయితే అప్పటికే హీరోగా చేస్తున్న చిరు వద్దని సున్నితంగా చెప్పినా నువ్వు మంచి నటుడివి, అలా అంటే ఎలా నెక్స్ట్ నీతో హీరోగా పెట్టి సినిమా తీయాలనీ అనుకుంటున్నాం అనేసరికి పెద్ద బ్యానర్ నిరాకరిస్తే పదిమంది వేరే నిర్మాతలతో పోయి చెడుగా తన గురించి చెబితే ఎలా అని భయపడి సరేనని ‘కొత్త అల్లుడు’ సినిమాలో విలన్ గా చేశారట చిరు.

ఇక ఆ తరువాత మరో సినిమా కృష్ణ తోనే ప్లాన్ చేసిన ఆ నిర్మాతలు గెస్ట్ రోల్ చేయమని అడిగారట. అదేంటి హీరోగా నాతో సినిమా తీస్తానన్నారు కాదా అంటే నెక్స్ట్ చేద్దాం, ఇది చెయ్ అని చెప్పారట. కాదనలేక మరోసారి చేసాడు. అయితే ఈసారి చిరుని హీరోగా పెట్టి సినిమాలను తీస్తున్న నిర్మాతలు అలా వేరే సినిమాల్లో విలన్ గా గెస్ట్ రోల్స్ లో చెస్తే ఎలా నువ్వు అని అడిగేసరికి వారికి సర్ది చెప్పి వీళ్ళు మాటిచ్చారని ఎదురుచూసినా ‘కొత్త పేట రౌడీ’ సినిమా చేసాక ఆ నిర్మాతలు చిరంజీవి తో సినిమా గురించి అసలు ఇక ప్రస్థావించలేదట. దీంతో వాళ్ళు చేసిన మోసానికి మనసులోనే చిరు కుమిలిపోయాడే కానీ బయట ఎవరికీ చెప్పలేదట. ఇలాంటివి ఎన్నో భరించాడు కాబట్టే నేడు మెగాస్టార్ అయ్యాడు మరి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago