Sreemukhi : తెలుగు బుల్లితెర మీద తనకుంటూ ఒక గుర్తింపు ఉన్న యాంకర్ శ్రీముఖి, గ్లామర్ తో కాకుండా తన మాటలతో ఆకట్టుకునే శ్రీముఖి గ్లామర్ షో తక్కువగా చేస్తూ యాంకర్ గా టాప్ ప్లేసులో ఉంది. ఓవైపు టీవీ షోస్ మరో వైపు ఈవెంట్స్ అంటూ చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక బిగ్ బాస్ రియాలిటీ షోలో రన్నర్ అప్ గా నిలిచి మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీ ముఖి ప్రస్తుతం ఆహా ఒరిజినల్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో డాన్సింగ్ ఐకాన్ షో లో సందడి చేయనుంది.
ఊ అంటావా.. ఊహు అంటావా…
ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే సింగింగ్ ఐడల్ మొదటి సీజన్ ను పూర్తి చేసారు. ఇక ఇప్పుడు మరో సరికొత్త షోకి శ్రీకారం చుట్టారు, అదే డాన్సింగ్ ఐకాన్. ఇందులో జడ్జిలుగా శేఖర్ మాస్టర్, రమ్యకృష్ణ వ్యవహారిస్తారు. ఇక 11 మంది కాంటెస్టంట్లు పాల్గొనే ఈ షోలో మూడు టీంలుగా ఉంటారు శ్రీ ముఖి, మోనాల్ గజ్జర్, యాష్ మాస్టర్ వీరికి లీడర్లుగా ఉంటారు. ఇక షో ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ ముఖి తన కాంటెస్టంట్స్ తో కలిసి పుష్ప సినిమాలోని ఊ అంటావా.. మావ ఊహు అంటావా పాటకు స్టెప్పులు వేసింది. ఇక శేఖర్ మాస్టర్ కూడా శ్రీముఖి తో ఆ పాటకు స్టెప్పులేయడం విశేషం. ఇక శ్రీ ముఖి డాన్స్ ను అల్లు అరవింద్ ప్రశంసించారు. మిగిలిన కంటెస్టెంట్స్ కు ఏమాత్రం తగ్గకుండా డాన్స్ చేసావ్ అంటూ పొగిడారు.
ఇక ఈ షోలో మరో విశేషం కాంటెస్టెంట్లను వేలం లో పెద్ద సినిమా బ్యానర్లు కొనుక్కోవడం. గీతాఆర్ట్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఇద్దరు కంటెస్టెంట్స్ చొప్పున వేలంలో తీసుకోనున్నారు. ఒక డాన్స్ లో కాంటెస్టెంట్స్ ని ఏకంగా పెద్ద బ్యానర్స్ కొనుక్కోవడం అంటే షో మామూలుగా ఉండదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక శనివారం, ఆదివారం ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమయ్యే ఈ షో విన్నర్ కి ఒక టాప్ హీరో సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్ 11 నుండి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ షో వస్తుంది.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…