Categories: FeaturedMovie News

Manchu Manoj : భూమా మోనికా రెడ్డి మొదటి పెళ్లిలో గెస్ట్ గా మనోజ్… వైరల్ అవుతున్న అప్పటి వీడియో..!

Manchu Manoj : గత రెండు రోజులుగా బాగా వైరల్ అవుతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి పెళ్లి. వీళ్లిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనగానే అసలు వీరికి ఎలా పరిచయం అనే ఆరాలు మొదలయ్యాయి. మొన్న మనోజ్ స్నేహితుడు రవి అనే వ్యక్తి సీతాఫల్ మండి లో వినాయకుణ్ణి పెట్టడం, అక్కడికి మనోజ్ ను ఆహ్వానించడంతో మనోజ్, మౌనిక ఇద్దరూ అక్కడకి ప్రత్యేక పూజలు చేయించుకోడానికి రావడంతో అందరి దృష్టి ఈ జంట మీద పడింది. ఇప్పటికే మంచు మనోజ్ ఒక పెళ్లి జరిగి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అయితే మౌనిక కూడా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి చాలా మందికి తెలియదు.

మౌనికా రెడ్డి పెళ్ళిలో సందడి చేసిన మనోజ్…

మౌనికా రెడ్డి కి 2015 లో చిత్తూరు జిల్లా కు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యాపారవేత్తతో పెళ్లి ఘనంగా జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే 2020 తరువాత ఈ జంట విడిపోయారు. యాదృచ్చికమో మరేమిటో కానీ మౌనికా రెడ్డి మొదటి పెళ్లి లో మనోజ్ హాజరైయ్యాడు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం బయటికి రావడంతో మౌనికా రెడ్డి పెళ్ళిలో మనోజ్ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇక మౌనిక భర్తతో విడాకులు తీసుకున్నా వాళ్ళ బిడ్డ విషయంలో ఇంకా సెటిల్ అవలేదంట అందుకే పెళ్లి విషయంలో ఇంకా నిదానంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మౌనికా రెడ్డి, మంచు మనోజ్ లు చెన్నై లో స్నేహితుల ద్వారా కలిశారు. ఆ తరువాత వారిద్దరూ పరిచయం పెంచుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో కలిసి ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఇప్పటికే కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago