Categories: FeaturedMovie News

Bhanumathi Ramakrishna : ఆ డైలాగులు నేను ఎలా చెప్తానని అనుకున్నావ్… బాలకృష్ణ సినిమాలో నో చెప్పి మళ్ళీ నటించిన భానుమతి..!

Bhanumathi Ramakrishna : తెలుగు అలనాటి హీరోయిన్లలో అందరూ ఓ వైపు అయితే భానుమతి గారు ఒక వైపు. సినిమాలో తన పాత్ర నచ్చితే కానీ సినిమా ఒప్పుకోని భానుమతి 50 ఏళ్ల సినిమా కెరీర్ లో చేసిన సినిమాలు వంద దాటుండవు. ఆ సంఖ్య చూస్తే అర్థమైపోతుంది భానుమతి గారు సినిమాల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో. ఇక సినిమాలో నటించడమే కాకుండా భానుమతి గారు ఆవిడ సినిమాల్లో పాటలు కూడా పాడారు. చిన్న వయసులోనే తండ్రి వద్ధ సంగీతం నేర్చుకున్న భానుమతి గారు 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. ఇక ‘వరవిక్రయం’ సినిమాతో నటనలో అడుగుపెట్టిన భానుమతి గారు ఆ తరువాత మల్లీశ్వరి, సారంగధర, విప్ర నారాయణ, బొబ్బిలి యుద్ధం, పెళ్లి కానుక వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.

పెళ్లి లోనూ కథానాయకుడే…

ఇక భానుమతి మగ రాయుడు లాగే వ్యవహరించేవారు. తనకు నచ్చితేనే ఏ సినిమా అయినా ఒప్పుకునే భానుమతి అటు నటనే కాకుండా ప్రొడక్షన్ పనులు నేర్చుకున్నారు. ఇక డైరెక్టర్ గా అప్పట్లోనే మూడు భాషల్లో ఏక కాలంలో సినిమా కూడా తీశారు. ఇక భానుమతి గారు పెళ్లి విషయంలోనూ విభిన్నత చాటుకున్నారు. అగ్ర హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.

బాలయ్య సినిమాలో డైలాగులు నచ్చక సినిమాకు నో…

ఇక బాలకృష్ణ హీరోగ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘మంగమ్మ గారి మనవడు’ ఆ సినిమాలో మంగమ్మ పాత్రలో భానుమతి గారు నటించారు. అయితే సినిమాలో కొన్ని డైలాగులు భానుమతి గారికి నచ్చలేదట మొదట. కోడి రామకృష్ణ వెళ్లి డైలాగులు చెప్పగానే ఇలాంటి డైలాగులు నేను చెబితే జనం ఏమనుకుంటారు నేను ఎలా చెప్తాను అనుకున్నావ్ అంటూ కోప్పడ్డారట. ఆ డైలాగులు చెప్పాల్సి వస్తే ఇక సినిమాలో నటించనని తెగేసి చెప్పారట. అయితే కోడి రామకృష్ణ గారు ఆమెను ఒప్పించి మీరు చెప్పండి సినిమా విడుదల అయ్యాక ఈ డైలాగులు హిట్ అవ్వక పోతే నన్ను అడగండి అంటూ నచ్చజెప్పి సినిమాలో నటించడానికి ఒప్పించాడట. చివరికి ఆ వద్దన్న డైలాగులను భానుమతి గారు చెప్పారట సినిమాలో. సెప్టెంబర్ 7 న భానుమతి గారి జయంతి, ఆవిడ లేకపోయినా ఆమె నటించిన సినిమాలోని పాత్రలు ముఖ్యంగా మంగమ్మ గారి మనవడు, బామ్మ మాట బంగారు బాట వంటి చిత్రాలు ఈ తరం వారికి ఆమెను గుర్తు చేస్తాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago